మహేష్ - నమ్రత పెళ్లికి కృష్ణ ఒప్పుకోకపోతే ఇందిరా దేవి ఏం చేసారో తెలుసా..?

Anilkumar
సెలబ్రిటీల తల్లిదండ్రులు , భార్యలు  ఎక్కువగా కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడరు.. ఇక అలాంటి వారిలో కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి కూడా ఒకరు.అయితే ఈమెకు సంబంధించిన మీడియా వార్తలు పెద్దగా ఉండవు.. ఆమె ఎక్కడ ఉంటారు ? ఏం చేస్తుంటారు.అంతేకాదు  ఎక్కడికి వెళ్తారు? ఇలా ఏ విషయాలు కూడా పెద్దగా చర్చకు రావు..  ఆమె గురించి ఎప్పుడూ కూడా రూమర్స్ కూడా కనీసం మీడియాలో రాలేదని చెప్పాలి. అయితే ముఖ్యంగా కృష్ణ - విజయనిర్మలను వివాహం చేసుకున్న తర్వాత ఒంటరిగానే ఉంటున్నారు.. 

విజయనిర్మలతో పిల్లలు వద్దు అని ఇందిరా దేవి ఒప్పుకున్న తర్వాతనే కృష్ణ పెళ్లి చేసుకున్నారు. మరి ముఖ్యంగా ఇందిరతో ఐదు మంది పిల్లలకు తండ్రి అయిన కృష్ణ.. విజయనిర్మలతో వివాహం జరిగిన తర్వాత విజయనిర్మల తోనే కలిసి ఉండేవారు.ఇక  ఇది ఇలా ఉంచితే ఇందిరాదేవి ఎక్కువగా పిల్లలతోనే సమయం గడిపేవారు.అయితే  ముఖ్యంగా వారి బాధ్యతలను ఆమె స్వయంగా చూసుకొని.. వారికి ఉన్నత చదువులు చదివించింది.అయితే అందరికీ కూడా దగ్గరుండి మరీ వివాహం చేసిన ఇందిరాదేవి మహేష్ బాబు.. నమ్రతను ప్రేమించి పెళ్లి చేసుకోవడం కృష్ణకు నచ్చలేదు.

 వారిద్దరు రహస్యంగా ముంబైలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. సమయంలో కృష్ణ చాలా బాధపడ్డారట. తెలుగు అమ్మాయిని మహేష్ బాబుకి చేయాలని చూశారు. ఆయన పట్టు వదలకపోవడంతో ఇందిరా దేవి స్వయంగా జోక్యం చేసుకొని కృష్ణను ఒప్పించారట..  అలా మహేష్ నమ్రతల వివాహం జరగడానికి ఇందిరా దేవి ఎంతో కృషి చేసింది.కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు మరణించే వరకు కూడా ఆమె ఆయన దగ్గరే ఉన్నారు.  రమేష్ బాబు మరణించాక మానసికంగా కృంగిపోయారు అని ఆమె సన్నిహితులు తెలియజేస్తున్నారు.అయితే ఇందిరా దేవి మరణానికి రమేష్ బాబు మరణమే కారణమని ఆమె సన్నిహిత వర్గాల నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక తల్లి ఎదుటే కొడుకు కన్నుమూస్తే ఆ బాధ వర్ణనాతీతం.  అదే ఆమెను మానసికంగా కృంగతీసింది.అయితే  ఆ బాధతోనే ఇందిరాదేవి కన్ను మూశారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: