షాక్: మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూత..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన నటనను ప్రదర్శించి సూపర్ స్టార్ గా పేరు సంపాదించారు. ఇక ఈయన కుమారులలో రమేష్ బాబు హీరోగా నటించినా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఇక రెండో కుమారుడు మహేష్ బాబు మాత్రం ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నారు. ఇక కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి.. కాగా రెండవ భార్య నిర్మల.. ఈమె సినీ రంగానికి చెందిన నటి కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలకు వ్యవహరించింది. ఇప్పుడు తాజాగా కృష్ణ మొదటి భార్య ఇందిరాదేవి తన స్వగృహంలోనే మరణించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం విన్న వెంటనే అభిమానులు ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి అవుతున్నారు.

గడిచిన కొద్ది నెలల క్రితం కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు పలు అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. ఇక ఇప్పుడు తాజాగా తన భార్య ఇందిరా దేవి మరణించడంతో ఒకే ఏడాది కృష్ణ కుటుంబంలో రెండు విషాదఛాయలు ఏర్పడ్డాయని సినీ ప్రేక్షకులు తెలియజేస్తున్నారు... అయితే గడిచిన కొన్ని నెలల క్రితం నుంచి ఇందిరాదేవికి AIG ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నట్లు సమాచారం. అయితే నిన్నటి రాత్రి ఈమె ఆరోగ్యం విషమించడంతో మరణించినట్లుగా సమాచారం. దీంతో ఈమెకు పలువురు సినీ ప్రముఖులు,రాజకీయవేత్తలు కూడా ఈమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.

ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీలో కూడా వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గడిచిన కొద్ది రోజుల క్రితం రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణ వార్తతో సినీ ఇండస్ట్రీ అతలాకుతలమయింది. ఇప్పుడు తాజాగా కృష్ణ భార్య ఇందిరా దేవి మృతి చెందడంతో మరింత భాగోద్వేగానికి గురవుతున్నారు సినీ ప్రేక్షకులు. ఇక ఈమె పార్థివ దేహాన్ని చూడడానికి భారీ ఎత్తున అభిమానులు వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కృష్ణ కుటుంబం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: