పిలిచి ఇంతలా అవమానిస్తారా.. కంటతడి పెట్టిన రోజా?

praveen
జబర్దస్త్ జడ్జి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు హీరోయిన్గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు లో నటించి తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని కోట్ల మంది అభిమానులను సంపాదించుకుని తనకు తిరుగులేదు అని నిరూపించింది. ఈ క్రమంలోనే సినిమాల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ రాణించింది అని చెప్పాలి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందింది. ఇక ఇటీవలే మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టింది.

 ఇక బుల్లితెరపై జబర్దస్త్ లో ఎన్నో ఏళ్ల నుంచి జడ్జిగా కొనసాగిన రోజా మంత్రి పదవి వచ్చిన తర్వాత తాను ప్రజల కోసం పనిచేయడానికి ఇబ్బంది అవ్వకూడదు అనే ఉద్దేశంతో జబర్దస్త్ వదిలేస్తున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక రోజా వెళ్లిపోవడంతో ఆమె స్థానాన్ని ఇంద్రజ భర్తీ చేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే జబర్దస్త్ ను విడిపోయిన ఎన్నో రోజుల తర్వాత ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీకి స్పెషల్ గెస్ట్ గా వచ్చింది ఒకప్పటి జబర్దస్త్ జడ్జి రోజా. ఇటీవలే దసరా స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు అన్న విషయం తెలిసిందే.

 అయితే రోజా మరోసారి స్టేజి మీద అలరించడానికి రావడంతో ఆమెను చూసిన అభిమానులు అక్కడున్న మిగతా కమెడియన్స్ అందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. రావడం రావడమే ఆది రాంప్రసాద్ లపై పంచులు వేసి అలరించింది రోజా. ఇక చివర్లో రోజాకి మెడలో పూలదండ వేసి సన్మానం చేశారు ఇలాంటి సమయంలో హైపర్ ఆది ఆమెను అవమానించినట్లు మాట్లాడాడు. నూకరాజు అడగకూడని ఒక ప్రశ్న అడగగా.. అందుకు హైపర్ ఆది వత్తాసు పలకడంతో.. అవమానించడానికి మీరు ముందు నిర్ణయించుకుని నన్ను పిలిచారు కదా అంటూ కన్నీరు పెట్టుకుంటూ స్టేజ్ దిగి వెళ్ళిపోయింది రోజా. ఇది చూసి అభిమానులు షాక్ అయితే కొంతమంది మాత్రం టిఆర్పి స్టంట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: