షాక్: ఆ సినిమా కోసం వృద్ధుడి పాత్రలో రవితేజ..?

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీ లో మాస్ మహారాజ గా పేరుపొందారు రవితేజ.ఇక ప్రస్తుతం ఎన్నో సినిమాలను తన చేతిలో పెట్టుకున్నారు. ఇటీవల రామారావు ఆన్ డ్యూటీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగ ఈ సినిమా భారీ డిజాస్టర్ ని చూసింది. అయితే ఇప్పుడు తాజాగా ధమాకా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు మరొకసారి రావడానికి సిద్ధంగా ఉన్నారు. రవితేజ ఈ చిత్రాన్ని త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీల నటిస్తున్నది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్ ,సాంగ్స్ సినిమాకి మంచి హైప్ ని పెంచాయి. ఇక వీటితోపాటు టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో కూడా నటిస్తున్నారు రవితేజ. అలాగే రావణాసుర అని చిత్రంలో కూడా నటిస్తూ ఉన్నారు.

ఇక ఇవే కాకుండా చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా లో కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాలు అన్నిటితో పాటు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నటించబోతున్నట్లుగా సమాచారం. రవితేజ  ఈ సినిమాల ఒక కొత్త పాత్రలో కనిపించబోతున్నారని ఇప్పటివరకు ఆయన టచ్ చేయని పాత్రని చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ డ్యూయల్  రోల్లో కనిపించ బోతున్నట్లుగా సమాచారం.

అందులో ఒక పాత్ర వృద్ధుడి పాత్ర అన్నట్లుగా సమాచారం ఈరోజు ప్రేక్షకులకు షాకింగ్ కలిగించేలా ఉంటుంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ చిత్రం తో రవితేజ ఎంతవరకు మెప్పిస్తారని విషయం తెలియాల్సి ఉంది. అనుపమ పరమేశ్వర నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం ఈ చిత్రాన్ని త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్లు ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ ఎంత బిజీగా ఉన్నప్పటికీ వరుసగా పలు సినిమాల లో నటిస్తు ఉన్నారు. అయితే సినిమాలు ఫ్లాపులు సక్సెస్ సంబంధం లేకుండా వరుస సినిమాలు ఒప్పుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: