తన కొడుకుని ప్రమోట్ చేస్తున్న ప్రభాకర్...!!

murali krishna
బుల్లితెర ప్రముఖ నటుడు ప్రభాకర్ ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ అయ్యారు. అందుకు కారణం ఆయన కాదు


ఆయన సుపుత్రుడు చంద్రహాస్. ఇటీవలే చంద్రహాస్ నటించిన డెబ్యూ సినిమాకి సంబంధించి ఓ అనౌన్స్‌మెంట్ కూడా జరిగిందట.


ఇందుకోసం ఓ పెద్ద ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, ఇండస్ర్టీలో తనకున్న ఇమేజ్‌ని బాగానే పెట్టుబడి పెట్టాడు నటుడు ప్రభాకర్. అయితే, ఈ ప్రెస్ మీట్‌ లో చంద్రహాస్ వ్యవహరించిన తీరును తప్పు బడుతూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ అయితే జరిగాయి.


ఇంకా తొలి సినిమా రిలీజ్ కాకుండా నే చంద్రహాస్ ఆటిట్యూడ్ చూపిస్తున్నాడ నీ, జేబు లో చేతులు పెట్టుకుని, నిలబడి న చోట నిలబడకుండా చాలా చాలా ఓవరాక్షన్ చేశాడనీ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్ చేశారట.


నిజానికి ఈ కామెంట్లూ, ట్రోల్స్ కారణంగానే చంద్రహాస్‌కి ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసింది. ఇక ఈ ట్రోల్స్‌పై ప్రభాకర్ కూడా యూ ట్యూబ్ ఛానెల్స్ వేదిక గా రెస్పాండ్ అయ్యారు. చంద్రహాస్ ఇంకా చిన్నోడే, పోను పోను మీడియా ముందు ఎలా వ్యవహరించాలి.. అనేది తెలుసుకుంటాడు.. వాడు నిలబడడం ఇప్పుడు నచ్చకపోవచ్చు. తర్వాత వాడి యాక్టింగ్ నచ్చి ఇప్పుడు తిట్టిన వాళ్లే వాడ్ని పొగిడి నెత్తిన పెట్టుకోవచ్చు.. అంటూ సున్నితంగా కొడుకును సమర్ధించాడట.


ఇక ఇప్పుడు మరోసారి మనోడు వార్తల్లో హాట్ టాపిక్ అయ్యాడు. హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియం లో జరిగిన ఇండియా, ఆస్ర్టేలియా టీ 20 క్రికెట్ మ్యాచ్‌లో చంద్రహాస్ సందడి చేశాడు. తండ్రి ప్రభాకర్‌ తో కలిసి ఈ స్టేడియంలో చంద్రహాస్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆ ఫోటో లు ఇప్పుడు మళ్లీ నెట్టింట్లో బాగా హల్‌చల్ చేస్తున్నాయ్. దాంతో 'నువ్వేమైనా సూపర్ స్టార్ అనుకుంటున్నావా.? అంటూ మరోసారి నెటిజన్లు చంద్రహాస్‌ని టార్గెట్ చేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: