అయోమయంలో వున్న ప్రాజెక్ట్ కె టీమ్...!!

murali krishna
ప్రభాస్ ప్రాజెక్టు K: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య వెరైటీ గా ఉండాలని.. వైవిధమ్యైన చిత్రాలు రావాలని ప్రేక్షకులు కూడా బలంగా కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ వెరైటీ నే ప్రభాస్ ఫ్యాన్స్ కు నిద్ర పట్టనియ్యడం లేదు.
ప్రభాస్ - యంగ్ క్రేజీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ల కలయికలో రానున్న సినిమా 'ప్రాజెక్ట్‌ కే'. ఈ సినిమా కథతో ఆల్ రెడీ రీసెంట్ గా ఒక సినిమా వచ్చేసింది. ఇదే ఇప్పుడు 'ప్రాజెక్ట్‌ కే' టీమ్ ను ఆందోళనలోకి నెట్టేసింది. అయినా ఇద్దరు దర్శకులు కాస్త ఆటో ఇటుగానో తీసే సినిమాలకు సంబంధించిన కాన్సెప్ట్ ఒకటిగానే ఉంటుంటాయి. రీసెంట్‌గా విడుదలై ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఒకే ఒక జీవితం చిత్రం.

ఈ సినిమా మెయిన్ కథ విషయానికి వస్తే.. కథలోని ప్రధాన పాత్రధారులకు గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే ఛాన్స్ వస్తోంది. టైమ్ మిషన్‌లో వారి బాల్యంలోకి వెళ్లి వస్తారు. టైమ్ ట్రావెట్ అనే కాంప్లికేటెడ్ పాయింట్‌ను దర్శకుడు శ్రీ కార్తీక్ కి బాగా హ్యాండిల్ చేశాడు. పైగా ఎలాంటి కన్‌ఫ్యూజన్, భారీతనం లేకుండా చక్కగా తెరకెక్కించాడు. సేమ్ పాయింట్‌ తో 'ప్రాజెక్ట్‌ కే' సినిమాని తీస్తున్నాడు నాగ్ అశ్విన్. పైగా ఇది పాన్ ఇండియా సినిమా. ఏకంగా రూ.550 కోట్ల బడ్జెట్‌తో బారి అంచనాలతో  ఈ సినిమా రూపొందుతుంది.
ఇప్పటికే ఈ సినిమా సెట్స్‌పై ఉంది. కథ కూడా మార్చడానికి లేదు. అన్నిటికీ మించి పాన్ ఇండియా రేంజ్‌లోని అగ్ర తారగణమంతా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కానీ ఈ సినిమా టైమ్ మిషన్ కాన్సెప్ట్‌, ఒకే ఒక జీవితం టైమ్ మిషన్ కాన్సెప్ట్‌ సేమ్. ప్రాజెక్ట్‌ కే' లో సైంటిస్ట్ గా అమితాబ్ నటించబోతున్నాడు. ప్రభాస్ హీరో, దీపికా హీరోయిన్. ఇంత చేసి..చివరకు కథ పాతది అయితే ఏం బాగుంటుంది ?, అందుకే ప్రస్తుతం నాగ్ అశ్విన్ టీమ్ అయోమయంలో ఉంది.
ఎలాగైనా కథలో మార్పులు చేయాలని కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే.. బడ్జెట్‌కు తగ్గట్టు భారీ రేంజ్‌లో కథ ఆవిష్కరించబోతున్నారు. అయినా భయపడాల్సిన అవసరమే లేదు. ఒకే ఒక జీవితం సినిమాలాగా కాకుండా ఈ సినిమా నేపథ్యం వేరు. రెండు సినిమాలు చూడటానికి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ప్రభాస్ ప్లేస్ లో మరో హీరో గుర్తుకు రాడు. కాబట్టి, ఈ సినిమాకి మరో సినిమాకి పోలిక రాదు.
అయినా ఇది కొత్తేమీ కాదు. గతంలో ఇది చాలా సార్లు జరిగింది. అపరిచితుడు, చంద్రముఖి సినిమా కథాంశాలు ఒక్కటే. బాగా పరిశీలిస్తే.. ఈ రెండు చిత్రాల యొక్క మెయిన్ కాన్సెప్ట్‌.. మల్టిపుల్ పర్సనాలిటీ డిజాస్టర్‌. కానీ, వీటి బడ్జెట్స్, బ్యాక్ డ్రాప్స్ పూర్తిగా వేర్వేరు. అయినప్పటికీ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. కావున, ఇప్పుడు కూడా ప్రభాస్ సినిమా భారీ హిట్ అవుతుందని ఆశించొచ్చు అని యువ దర్శకుడు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: