ఆల్రెడీ బాహుబలి చూసాం ఇంకో బాహుబలి అవసరం లేదు.. హీరో కార్తీ సెన్సేషనల్ కామెంట్స్..!!

Anilkumar
మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్‌, కార్తి, జయం రవి, ప్రకాశ్‌ రాజ్‌, ఐశ్వర్యా రాయ్‌, త్రిష, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్, విక్రమ్‌ ప్రభు, శోభిత ధూళిపాళ..లాంటి స్టార్ యాక్టర్స్ తో తెరకెక్కిన భారీ సూపర్ డూపర్  సినిమా 'పొన్నియిన్‌ సెల్వన్‌ 1'. అయితే ప్రముఖ తమిళ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా, చోళుల కథతో ఈ సినిమా తెరకెక్కింది.ఇక  ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇకపోతే ఈ సినిమాని రెండు పార్టులుగా తెరకెక్కిస్తుండగా మొదటి పార్ట్ 'పొన్నియిన్‌ సెల్వన్‌ 1' సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇక దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఇదిలావుంటే తాజాగా 'పొన్నియిన్‌ సెల్వన్‌ 1' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఇక దీంతో స్టార్లంతా హైదరాబాద్ లో సందడి చేశారు. అయితే తెలుగులో ఈ సినిమాని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు.ఇదిలావుంటే ఇక ఈ ఈవెంట్లో కార్తీ మాట్లాడుతూ.. ”ఈ సినిమా మణిరత్నం గారి నలభై ఏళ్ల కల. అంతెందుకు వె సినిమా చాలా గొప్ప మీడియం.అంతేకాదు  ఇక్కడ క్యాస్ట్, రిలీజియన్ తో సంబంధం లేకుండా పనిచేస్తాం. అయితే అందరూ అడుగుతున్నారు ఇది 'బాహుబలి' సినిమాలా ఉంటుందా అని.

 ఇక మనం ఆల్రెడీ ఒక 'బాహుబలి' సినిమా చూశాం. ఇక మనకి ఇంకో 'బాహుబలి' అవసరం లేదు. అయితే ఇండియాలో చాలా కథలు ఉన్నాయి, చాలా మంది హీరోలు ఉన్నారు. ఇక వాటిని మనం ప్రజలకు చెప్పాలి.కాగా  రామాయణ, మహాభారతం లాగా ఇది కూడా ఒక గొప్ప కథ.అయితే  ఇందులో రాజకీయం, లవ్, రొమాన్స్, అడ్వెంచర్ అన్ని ఉన్నాయి.ఇక  ఇలాంటి ఒక గొప్ప సినిమాని మీరు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది” అని అన్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: