2 వారాల్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని కోట్ల లాభాలను అందుకున్న 'ఒకే ఒక జీవితం' మూవీ..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరో లలో ఒకరు అయినటు వంటి శర్వానంద్ తాజాగా ఒకే ఒక జీవితం అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శర్వా నంద్ సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటించగా ,  శ్రీ కార్తిక్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. అక్కినేని అమల ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించగా ,  ప్రియదర్శి ,  వెన్నెల కిషోర్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్ర లలో నటించారు. ఈ మూవీ సెప్టెంబర్ 9 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యింది.  

ఇప్పటి వరకు ఈ మూవీ రెండు వారాల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదలకు ముందు ఏ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టు కునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెల కొని ఉన్న సందర్భంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 7.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 8 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బడిలోకి దిగింది.

2 వారాల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఒకే ఒక జీవితం మూవీ ప్రపంచ వ్యాప్తంగా 10.15 కోట్ల షేర్ ,  24.00 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.  దీనితో ఒకే ఒక జీవితం మూవీ రెండు వారాల బాక్స్ ఆఫీస్ రాని ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 2.15 కోట్ల లాభాలను అందుకుంది. ఈ సినిమా ప్రస్తుతం కూడా థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించ బడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: