వావ్: కాంట్రవర్సీ క్వీన్ ని మెప్పించిన సీత..!!

Divya
హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా తెరకెక్కించిన చిత్రం సీతారామం.. ఇక ఈ సినిమా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ మృణాల్ ఠాగూర్ కి కూడా మంచి గుర్తింపు లభించింది . ప్రతి ఒక్కరు కూడా ఈమె ఈ సినిమాలో సీత పాత్రలో నటించిన ఈమెను అందరూ సీత అని పిలుస్తూ చాలా గౌరవంగా ఈమెపై తమ అభిమానాన్ని పెంచుకుంటున్నారు.. ఇక సినిమా చూసిన తర్వాత సినీ ప్రేక్షకులు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా.. హీరోయిన్ మృణాల్ ఠాగూర్ ని అందరూ ఆమె నటనకు మెచ్చి ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా ఈ సినిమాను వీక్షించి మృణాల్ ఠాకూర్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు.కంగనారనౌత్ మాట్లాడుతూ నిన్న సీతారామం సినిమా చూశాను. హను రాఘవపూడి సినిమా టీం కి శుభాకాంక్షలు అంటూ తెలిపింది. అంతేకాదు సినిమా చాలా అద్భుతంగా ఉంది అని , ఈ ఎపిక్ లవ్ స్టోరీ చూస్తున్నంత సేపు మధురానుభూతి కలుగుతుంది. అంటూ ఆమె తన అనుభవాన్ని పంచుకున్నారు.. ముఖ్యంగా సినిమా స్క్రీన్ ప్లే అయితే అత్యద్భుతం .. అలాగే హీరోయిన్ మృణాల్ టాగూర్ గురించి కూడా మరొక స్పెషల్ పోస్ట్ పెట్టింది.  ఈ సినిమాలో నటీనటులందరూ కూడా తమ నటనను చాలా చక్కగా కనబరిచారు. ప్రత్యేకంగా మృనాల్ ఠాగూర్ చాలా అద్భుతంగా నటించింది. ఇక భావోద్వేగా సన్నివేశాలలో ఆమె నటించిన తీరు మహాద్భుతం.

ఇక తనలా మరెవరు నటించలేరు అనేంతగా తన నటన కనబరిచింది. మృణాల్ ఠాగూర్ నిజంగానే రాణి.. జిందాబాద్ ఠాకూర్ సా.. ఇక ముందు ముందు కాలం మీదే అంటూ మృణాల్ పై ప్రశంసలు కురిపించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా రూ.100 కోట్ల కలెక్షన్ ను ఎప్పుడో దాటేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: