దుల్కర్ సల్మాన్ హీరోగా మరో "లవ్ స్టోరీ" ?

VAMSI
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి గురించి దేశమంతా తెలిసిందే. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి ఏ రేంజ్ లో ఉన్నారో మలయాళంలో కూడా మమ్ముట్టి కి అదే స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన కడుపున పుట్టిన మరో సూపర్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. అయితే దుల్కర్ మొదట్లో మలయాళంలో సినిమాలు చేస్తూ వచ్చాడు... అవి కొన్ని కూడా తెలుగులో డబ్ అయ్యాయి. కానీ తెలుగులో స్ట్రెయిట్ మూవీగా వచ్చిన మహానటి సినిమాతో ఒక్కసారిగా తెలుగు లో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు. మహానటిలో తన సహజమైన నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేశాడు. ఇక ఆ తరువాత కొద్దిగా గ్యాప్ తీసుకుని సీతారామం లాంటి అద్భుతమైన ప్రేమకావ్యంతో మన ముందుకు వచ్చాడు.
ఈ సినిమా రిలీజ్ అయి అయిదు వారాలు పూర్తి అయింది. అయినప్పటికీ ఇంకా థియేటర్ లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇందులో దుల్కర్ సల్మాన్ రామ్ అనే ఒక సైనికుడిగా నటించి దేశ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇందులో సీతగా నటించిన మృణాల్ ఠాకూర్ కూడా అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో సీతగా నిలిచిపోయింది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించారు. కాగా దుల్కర్ ఇప్పుడు తన తర్వాత చిత్రాల కోసం కథలను వింటూ ఉన్నాడు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం మరో లవ్ స్టోరీ ని ఒక ప్రముఖ దర్శకుడు ఇప్పటికే దుల్కర్ కు వినిపించాడట.
ఈ కథ తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఈ సినిమా త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసుకోనుందని చిత్రపురి వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి. కానీ ఈ సినిమా స్టోరీ లైన్ మాత్రం చనిపోయే పాత్రగా కాకుండా... తన ప్రేమ కోసం ఎంత వరకు పోరాడి గెలుచుకున్నాడు అన్నది చూపించనున్నారు అట. మరి ఈ సినిమా డైరెక్టర్ ఎవరు ? హీరోయిన్ ఎవరు లాంటి ఎన్నో విషయాలు తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: