బిగ్ బాస్: పీటల వరకు వచ్చి ఆగిపోయిన శ్రీ సత్య పెళ్లి.. కారణం..?

Divya

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోలలో బిగ్ బాస్ నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది.  రియల్ కంటెస్టెంట్లతో.. మంచి వినోదాన్ని అందించే ఈ షో కి విపరీతమైన ఆదరణ లభించిందని చెప్పవచ్చు. ఇక బిగ్ బాస్ తెలుగులో ప్రస్తుతం 5 సీజన్లను పూర్తిచేసుకుని 6వ సీజన్ మొదలుపెట్టింది. ఇక మూడవ వారం కొనసాగుతున్న నేపథ్యంలో కంటెస్టెంట్ లు  కూడా తమ స్ట్రాటజీని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన 21 మంది కంటెస్టెంట్లలో సీరియల్ నటి శ్రీ సత్య కూడా ఒకరు. అయితే శ్రీ సత్య గత రెండు వారాల నుంచి నెటిజన్స్ నుంచి నెగిటివిటీ మూట కట్టుకుంటున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ నిర్వహకులు కూడా శ్రీ సత్య తినడానికి , పడుకోవడానికి మాత్రమే బిగ్ బాస్ హౌస్ కి వచ్చిందన్నట్లుగా చూపిస్తున్నారు . దీంతో ఈమె పై విపరీతంగా ట్రోల్స్ మొదలయ్యాయి.
ఇక రెండవ వారం ముగిసే రోజు నాగార్జున కూడా తినడానికి,  పడుకోవడానికి రావట్లేదు.. ఆట ఆడి స్ట్రాటజీ చూపించాలి అంటూ శ్రీ సత్యను నేరుగా అనేశాడు.. ఇక కంటెస్టెంట్లు కూడా తమతో సరిగా మాట్లాడడం లేదు అని శ్రీ సత్యను  నామినేట్ చేసిన విషయం కూడా తెలిసిందే . అయితే అసలు రీజనల్ ఏమిటి అంటే కొన్ని సమస్యల వల్ల డిప్రెషన్ లో నుంచి తేలుకోలేకపోతున్నాను అంటూ శ్రీ సత్య సమాధానం ఇచ్చింది. ఇక అసలు కారణం ఏమిటి అంటే శ్రీ సత్య.. పవన్ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది . ఇక నిశ్చితార్థం కూడా చాలా అంగరంగ వైభవంగా జరిగింది. కానీ పీటల వరకు వెళ్లకుండానే వీరి పెళ్లి ఆగిపోయింది.

అయితే అసలు కారణం ఏమిటి అని అడిగితే.. అందుకు కారణం పవన్ రెడ్డి అని.. తనను మోసం చేశాడు అని ఆమె ఆరోపించింది . కానీ పవన్ రెడ్డి మాత్రం ఆమెను మోసం చేయాలని అనుకుంటే నిశ్చితార్థం కూడా చేసుకొని పెళ్లి వరకు వెళ్లాలని నేను అనుకోను.. అంటూ సమాధానం ఇచ్చాడు. మరి ఇద్దరిలో ఎవరి తప్పు ఉంది? పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఏమిటి ?అనే విషయాలు మాత్రం వెల్లడించలేదు. ఏది ఏమైనా నిశ్చితార్థం జరిగి పెళ్లి ఆగిపోవడంతో శ్రీ సత్య అభిమానుల సైతం కొంచెం అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: