12 రోజుల్లో 'ఒకే ఒక జీవితం' మూవీ ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్లు ఇవే..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి శర్వానంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అనేక విజయాలను సొంతం చేసుకొని మంచి క్రేజ్ ని సంపాదించుకున్న శర్వానంద్ తాజాగా ఒకే ఒక జీవితం అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ టైమ్ ట్రావెలర్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది.

శ్రీ కార్తీక్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా , రీతూ వర్మ ఈ మూవీ లో శర్వానంద్ సరసన హీరోయిన్ గా నటించింది. అక్కినేని అమల ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించగా , వెన్నెల కిషోర్ ,  ప్రియదర్శి మూవీ లో ముఖ్య పాత్రలో నటించారు. ఈ మూవీ సెప్టెంబర్ 9 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయ్యింది. ఇప్పటి వరకు ఈ సినిమా 12 రోజుల బాక్సా ఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ 12 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.


నైజాం : 2.95 కోట్లు .
సీడెడ్ : 52 లక్షలు .
యు ఏ : 72 లక్షలు .
ఈస్ట్ : 47 లక్షలు .
వెస్ట్ : 33 లక్షలు .
గుంటూర్ : 47 లక్షలు .
కృష్ణ : 43 లక్షలు .
నెల్లూర్ : 26 లక్షలు .
12 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక జీవితం మూవీ 6.15 కోట్ల షేర్ , 10.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా;లో : 51 లక్షలు .
తమిళనాడు :  1.18 కోట్లు .
ఓవర్ సిస్ లో :  1.95 కోట్లు .
12 రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా ఒకే ఒక జీవితం మూవీ 9.79 కోట్ల షేర్ , 23.00 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: