రవితేజ 'ధమాకా' మూవీ నుండి మరో సాంగ్ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
మాస్ మహారాజ రవితేజ ఇప్పటికే ఈ సంవత్సరం ఖిలాడి మరియు రామారావు ఆన్ డ్యూటీ అనే మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ రెండు మూవీ లు కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రవితేజ వరస మూవీ లలో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా రవితేజ ప్రస్తుతం ధమాకా అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తూ ఉండగా , భీమ్స్ సిసిరోలియో ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ లో శ్రీ లీల , రవితేజ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ ని దర్శకుడు త్రినాధ్ రావు నెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని పోస్టర్ లను మరియు ఒక పాటను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.
 

ఇది ఇలా ఉంటే తాజాగా ధమాకా మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి 'మాస్ రాజా' అనే లిరికల్ వీడియో సాంగ్ ని సెప్టెంబర్ 23 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. చిత్ర బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ లో మాస్ మహారాజ రవితేజ స్టైలిష్ లుక్ లో నిలబడి ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి మూవీ యూనిట్ విడుదల చేసిన మొదటి లిరికల్ సాంగ్ ప్రేక్షకులను గానో అలరించింది. మరి ఈ 'మాస్ రాజా' అనే సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: