'లైగర్' ప్లాప్ తో ఆ నిర్ణయం తీసుకున్న పూరి జగన్నాథ్..?

Pulgam Srinivas
దర్శకుడు పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పూరి జగన్నాథ్ ఎన్నో విజయవంతమైన మూవీ లకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరిగా కొనసాగు తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా పూరి జగన్నాథ్ , విజయ్ దేవరకొండ హీరో గా తెరకెక్కిన లైగర్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో అనన్య పాండే విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించగా ,  మైక్ టైసన్ ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ లో రమ్య కృష్ణ , విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో నటించింది.

ఈ మూవీ ని పూరి కనెక్ట్స్ , ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లపై పూరి జగన్నాథ్ మరియు కరణ్ జోహార్ లి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ పై సినీ ప్రేమికులు మొదటి నుండి భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాను ఆగస్టు 25 వ తేదీన తెలుగు తో పాటు హిందీ , కన్నడ ,  మలయాళం , తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర ఘోరమైన నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ కలెక్షన్ లు కూడా రాలేదు. దానితో లైగర్ మూవీ ని కొన్న డిస్ట్రిబ్యూటర్ లకి తీవ్ర మొత్తంలో నష్టాలు మిగిలాయి.

ఇలా డిస్ట్రిబ్యూటర్ లాలూ తీవ్ర మొత్తాల్లో నష్టాలు రావడంతో పూరి జగన్నాథ్ 'లైగర్' మూవీ ద్వారా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్ లాలూ తిరిగి నష్టాలను తిరిగి ఇస్తాను అని మాట ఇచ్చినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఇద్దరికీ డబ్బులు కూడా పూరి జగన్నాథ్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే మిగతా వారికి కూడా రెండు నెలల్లో నష్టాన్ని తమ అకౌంట్ లో జమ చేయనున్నట్లు పూరి జగన్నాథ్ మాట ఇచ్చినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: