వావ్: బ్రహ్మానందం ఎనర్జిటిక్ వీడియో చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తను చేసే హంగామా అంతా ఇంతా ఉండదు. ఎంతమంది ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తూ ఉంటారు. బ్రహ్మానంద లేని సినిమా అంటూ లేదని చెప్పవచ్చు.. తెలుగులో ఎంతోమంది కమెడియన్లు ఉన్నప్పటికీ బ్రహ్మానందం పేరు బాగా పాపులర్ అయింది. బ్రహ్మానందం వెండితెరపై కనిపిస్తే చాలు కడుపుబ్బ నవ్వే ప్రేక్షకులు కూడా ఇప్పటికీ ఉన్నారు. ఇక బ్రహ్మానందం తెలుగులోనే కాకుండా తమిళ్ ,కన్నడ వంటి భాషలలో కూడా నటించడం జరిగింది. మొదట చంటబ్బాయి అనే సినిమాతో కమెడియన్గా తన ప్రస్తానాన్ని మొదలుపెట్టారు.

అయితే గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి చాలా తక్కువ సినిమాలు చేస్తున్నారు బ్రహ్మానందం కేవలం చిన్న చిన్న పాత్రలోనే మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. అల వైకుంఠపురం, జాతి రత్నాలు, భీమ్లా నాయక్ వంటి సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో కనిపించారు. రంగమార్తాండ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు బ్రహ్మానందం. ఇదంతా ఇలా ఉండగా మళ్లీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించడానికి బ్రహ్మానందం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి ఒక వీడియో నెట్టింట చాలా వైరల్ గా మారుతుంది. బ్రహ్మానందం ఫుల్ స్లాగ్ లో ఎంట్రీ ఇస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

బ్రహ్మానందం ఈ వీడియోని వర్ణిస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. ఇక గత కొంతకాలంగా తన కామెడీని దూరంగా ఉంచిన బ్రహ్మానందం ప్రస్తుతం ఈ వీడియోను చూసి నేటిజన్లు సైతం మిమ్స్ తో వైరల్ గా చేస్తున్నారు నైటిజన్లు. ఇక ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరూ బ్రహ్మానందం మళ్లీ బ్యాక్ అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది బ్రహ్మానందం అసలైన స్వాగ్ అంటే ఇదే అని పలు రకాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: