ఈ ముద్దు గుమ్మల కెరియర్ మారేనా..?

Divya
ఇండస్ట్రీలో ఎవరైనా సరే హిట్టు సాధించారంటే వారికి ఎక్కువ విలువ ఉంటుంది. ఇక వరుస ప్లాపులు పడ్డాయి అంటే చాలు వెంటనే వారు డేంజర్ జోన్ లో ఉన్నారని చెప్పవచ్చు. ఇక సినిమా అనేది గ్లామర్ కాబట్టి.. ఇక్కడ ఒకసారి సక్సెస్ అయ్యారంటే చాలు వారిని పట్టుకోవడం చాలా కష్టం.. అయితే ఆ లక్ రావడం మాత్రం అంత సులువైన పని కాదని చెప్పవచ్చు. ఇప్పుడు ఇదే పరిస్థితి ముగ్గురు క్రేజీ హీరోయిన్ల పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైందని చెప్పవచ్చు. వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అంత గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు అలాంటి వారిలో రాశి ఖన్నా, కేతిక శర్మ, హీరోయిన్ కృతి శెట్టి కూడా ప్రస్తుతం ఈ లిస్టులో చేరారని చెప్పవచ్చు. ఈ ముద్దుగుమ్మలు బ్యాటు బ్యాక్ వారి డిజాస్టర్లని చవిచూసారు అని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా వీరికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇక అదే స్థాయిలో కొట్టాలని మాత్రం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ముద్దుగుమ్మలు. ఇక ప్రతిరోజు పండుగే సినిమా తర్వాత రాశి ఖన్నా కెరియర్ అంతగా విజయాన్ని అందుకోలేదని చెప్పవచ్చు. ఇక తాజాగా విడుదలైన థ్యాంక్యూ చిత్రం కూడా డిజాస్టర్ గా మిగిలింది. ప్రస్తుతం కార్తీ తో నటిస్తున్న సర్దార్ సినిమా పైన ఆశలు పెట్టుకుంది.
ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. ఇక అలాగే దివారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా డిజాస్టర్ గా మిగిలాయి. ఇక నాగచైతన్య సినిమా పైన ఆశలు పెట్టుకుంది.ఈ ముద్దుగుమ్మ. వీరితోపాటు మరొక హీరోయిన్ కేతిక శర్మ.. మొదట రొమాంటిక్ సినిమాతో ఎంట్రీ ఇవ్వగా ఆ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది. ఇక తర్వాత లక్ష, రంగ రంగ వైభవంగా వంటి సినిమాలలో నటించక ఇవన్నీ డిజాస్టర్ గా మిగిలాయి. మరి తన తదుపరి చిత్రాలతో సక్సెస్ అందుకుంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: