బిగ్ బాస్ షో లో సందడి చేబోతున్న.... మిల్క్ బ్యూటీ...... ' తమన్నా '

murali krishna
డబుల్ ఎలిమినేషన్‌లో మొదటి ఎలిమినేషన్ అయిపోయింది. షానీ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇవాళ రెండో ఎలిమినేషన్ ఉంటుందని చెప్పడంతో ఒకటే టెన్షన్..
హౌస్‌మేట్స్ లో ను, ఆడియెన్స్‌లోను కూడా. మరి ఆ రెండో వ్యక్తి ఎవరు? ఇవాళ హౌస్ నుంచి ఎవరు వెళ్లిపోయారు?
బబ్లీ వచ్చింది.. కానుక ఇచ్చిందిహౌస్‌ నుంచి ఎగ్జిట్ అయ్యి బిగ్‌బాస్ స్టేజ్‌ మీదికి వచ్చింది అభినయశ్రీ. తన జర్నీని చూసి కాస్త ఎమోషనల్ అయ్యింది. అందుకే ఆట మొదట్నుంచీ ఆడాలి, లేదంటే ఇలాగే ఉంటుంది, షానీ, నువ్వు తప్పు చేశారని నాగ్‌ అంటే అవునని ఒప్పుకుంది. ఆ తర్వాత హౌస్‌లో ఐదుగురు నిజాయతీ గల కంటెస్టెంట్స్ పేర్లు చెప్పమని నాగ్ అడిగారు. అప్పుడామె ఫైమా, చంటి, శ్రీసత్య, బాలాదిత్య, సూర్యల పేర్లు చెప్పింది. ఫైమాతో తనకు ఏర్పడిన బాండ్‌ గురించి చెప్పి, వదిలి వెళ్తున్నందుకు బాధపడింది. చంటి కామెడీ తనకెంత పెద్ద రిలీఫో వివరించింది. శ్రీసత్య లైఫ్‌లో దెబ్బ తిని అలా ఉంది తప్ప చాలా స్ట్రాంగ్ అని, ఆమెకి వెన్నుపోటు పొడవడం తెలియదని అంది. మంచి కొడుకు, తండ్రి, స్నేహితుడు, గొప్ప వ్యక్తి అంటూ బాలాదిత్యకి కితాబిచ్చింది. సొంత తమ్ముడు కూడా ఇవ్వనంత అభిమానాన్ని సూర్య తనకి ఇచ్చాడని, అతనెప్పుడూ తన లైఫ్‌లో ఉంటాడని చెప్పింది. ఆ తర్వాత నిజాయతీ లేని ఐదుగురు ప్లేయర్స్ పేర్లు చెప్పమని నాగ్ అడిగితే.. ముందుగా రేవంత్ పేరు చెప్పింది. అతను చాలా కన్నింగ్ అని, ఫేక్‌గా ఆడతాడని, ఆ విషయం అతని ముఖమ్మీదే అన్నానని చెప్పిన అభినయశ్రీ.. అతను తప్ప ఇంట్లో ఫేక్‌గా ఆడేవాళ్లు ఎవరూ లేరని, అందరూ మంచివాళ్లేనని, అందుకే ఇక ఎవరి పేర్లూ చెప్పలేననీ అంది. గీతూని మాత్రం బ్రేవ్ గాళ్ అంటూ మెచ్చుకుంది. ఎవరు ఏమన్నా తను ఆట ఆడి తీరుతుందని, చాలా స్ట్రాంగ్ అని, టాప్‌ 3లో తప్పకుండా ఉంటుందని చెప్పి వెళ్లిపోయింది.
మొత్తానికి మొదటి వీకెండ్‌లో ఎలిమినేషన్ లేకుండా చేసి.. సెకెండ్ వీకెండ్‌లో ఇద్దరిని పంపించేశారు. దీనికి కారణం ఉంది. ప్రతిసారి కంటే ఈసారి షోకి తక్కువ టీఆర్పీ వస్తోంది. ఎందుకో తెలీదు కానీ లాంచింగ్ ఎపిసోడ్‌కి కూడా ఎప్పుడూ వచ్చేంత టీఆర్పీ రాలేదు. కంటెస్టెంట్లు సగంమంది డల్‌గా ఉండటంతో డైలీ ఎపిసోడ్స్ కూడా అంతంత మాత్రంగానే టీఆర్పీని రాబడుతున్నట్టు తెలిసింది. ఇలాగే వదిలేస్తే పూర్తిగా పడిపోతుందనే ఉద్దేశంతోనే నిన్నటి ఎపిసోడ్‌లో నాగ్‌ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారని, కంటెస్టెంట్లని ఆటలోకి నెట్టే ప్రయత్నం చేశారని అంటున్నారు. డల్‌గా ఉన్న ఇద్దరు కంటెస్టెంట్లని ఒకేసారి తగ్గించడానికి కూడా ఇదే కారణమట. మసాలా పెంచడానికి రేపు ఒక సూపర్బ్ టాస్క్ పెట్టినట్టు ప్రోమోలోనూ చూపించారు. కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు ఫైర్ అవుతున్నారు. గీతూ, ఇనయాలైతే కాస్త గీత దాటి 'దొబ్బెయ్' అని తిట్టుకుంటూ నిప్పులు చెరుగుతున్నారు. వీరి మధ్య అంత మంట పెట్టిన ఆ టాస్క్ ఏమిటో రేపు చూడాల్సిందే.
ఎపిసోడ్‌ మొదలవ్వగానే ముందుగా ఓ స్పెషల్‌ గెస్ట్ని ఆహ్వానించారు నాగార్జున. తనెవరో కాదు.. తమన్నా. 'బబ్లీ బౌన్సర్' మూవీ ప్రమోషన్ కోసం వచ్చిన ఆమెకి.. ఈ వారం ఒక కంటెస్టెంట్‌కి కానుక ఇచ్చి రావాలనే బాధ్యతను అప్పగించారు నాగ్. ఆమె హౌస్‌లోకి వెళ్లాక అబ్బాయిలందరికీ ఓ టాస్క్ ఇచ్చారు. ఇంట్లో ఉన్న అమ్మాయిల్లో ఎవరు మిమ్మల్ని కాపాడగలరో వారికి బౌన్సర్‌ ట్యాగ్ ఇవ్వమని చెప్పారు. ఒక్కో అబ్బాయీ ఒక్కో అమ్మాయిని తమ బౌన్సర్ గా సెలెక్ట్ చేసుకున్నారు. గీతూకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత అబ్బాయిల్లో ఒకరికి కానుక ఇవ్వమని తమన్నాతో చెప్పారు నాగ్. అందుకోసం నలుగురిని సెలెక్ట్ చేయమంటే.. రేవంత్, సూర్య, అర్జున్, రోహిత్‌ల పేర్లు చెప్పిందామె. తమన్నాని ఇంప్రెస్ చేసి కానుకను సంపాదించుకోమని ఆ నలుగురికీ నాగ్ చెప్పారు. రోహిత్, అర్జున్ తమకు నచ్చిన మాటలేవో చెప్పారు. రేవంత్ ఓ పాట పాడాడు. సూర్య మాత్రం అల్లు అర్జున్, ప్రభాస్‌ల వాయిస్‌తో తమన్నా గురించి మాట్లాడి మార్కులు కొట్టేశాడు. కానుక పట్టేశాడు.
బిగ్‌బాస్‌ చెట్టు మీద ప్రేమ పక్షులు
ఈసారి బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమపక్షుల కిలకిలా రావాలు బాగానే వినిపిస్తున్నాయి. బౌన్సర్ గేమ్ ఆడే సమయంలో ఆ విషయం బైటపడింది. అర్జున్ కళ్యాణ్ తన బౌన్సర్ గా శ్రీసత్యను ఎంచుకున్నప్పుడు బయట ఉన్న ఆడియెన్స్ చాలా గట్టిగా అరిచారు. దాంతో ఏంటా స్పందన అని అడిగారు నాగ్. వాళ్ల మధ్య ఏదో ఉందని ఒక ప్రేక్షకురాలు చెప్పడంతో 'అర్జున్ కళ్యాణ్ విషయంలోనా' అని అడిగారు. దానికి అర్జున్ ఇబ్బందిగా ముఖం పెట్టాడు. మిగతా కంటెస్టెంట్లు మాత్రం కమల్‌ హాసన్ అని అరుస్తూ అమాయకంగా నటిస్తున్నాడనే హింట్ ఇచ్చారు. వెంటనే అర్జున్ 'ఆమె నాకు మంచి ఫ్రెండ్ అంతే సర్' అన్నాడు. వెంటనే తమన్నా అందుకుంది. 'మనం ఎన్ని సినిమాల్లో నటించాం సర్.. అన్ని ప్రేమలూ స్నేహంతోనే మొదలవుతాయి' అంది. దాంతో నాగ్.. '100 పర్సెంట్ లవ్‌లో చైతు, నువ్వు కూడా అంతే కదా' అని అడిగితే అవునంది తమన్నా. ఆ సినిమాలో నీకు చికెన్ ఎంతిష్టమో శ్రీసత్యకి కూడా చికెన్ అంటే అంతే ఇష్టమని మరింత ఉడికించారు నాగ్. ఆ తర్వాత ఆరోహిని సూర్య ఎంచుకున్నప్పుడు కూడా ఆడియెన్స్ గట్టిగా అరిచారు. మళ్లీ ఇదేంటని నాగ్ అడిగితే.. మూడేళ్ల నుంచి పుట్టనిది ఇప్పుడేం పుడుతుందంటూ కంగారుపడింది ఆరోహి. 'నిన్ను మేమేమైనా అడిగామా' అని నాగ్ అంటే.. 'ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి కదా' అంది. దాంతో అభినయ కల్పించుకుని 'ఇద్దరి మధ్య చాలా ప్రేమ ఉంది సార్. నేను కళ్లారా చూశాను' అంటూ కొన్ని ఉదాహరణలు చెప్పింది. చివర్లో సూర్యకి తమన్నా ఇచ్చిన కానుక ఆరోహి దగ్గర ఉంటే సూర్యకి ఇచ్చేయమన్నారు నాగ్. అప్పుడు ఆరోహి 'మా ఇద్దరిలో ఎవరి దగ్గరున్నా ఒకటే కదా' అనడం అందరి కామెంట్స్ కి బలాన్నిచ్చింది. అర్జున్, శ్రీసత్యల సంగతి తెలీదు కానీ.. సూర్య, ఆరోహిల అనుబంధం ఇప్పటికే చాలాసార్లు ప్రేక్షకుల కళ్లలో పడింది. దానికి రియాక్షనే ఇవాళ కనిపించింది. మరి ముందు ముందు వీరి కథ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.
ఆటా పాటా.. మధ్యలో వేట
ప్రతి సండే ఎపిసోడ్‌లాగే ఈ ఎపిసోడ్‌లోనూ ఆట, పాటలతో సందడి నెలకొంది. హౌస్‌మేట్స్ అందరినీ రెండు గ్రూపులుగా విభజించారు. కొని పాపులర్ పాటల్లోని పదాలను గజిబిజి చేసి స్క్రీన్‌పై చూపిస్తాం, వాటిని గెస్ చేయమన్నారు. మొదట బజర్ నొక్కినవారికే చాన్స్ అని చెప్పారు. దాంతో పాటలు, డ్యాన్సులతో కాసేపు సరదా సరదాగా సాగింది. అయితే ఆనందంగా సాగిన ఈ ఆట మధ్యలోనే ఎలిమినేషన్ టెన్షన్‌ని అప్పుడప్పుడూ గుర్తు చేశారు నాగ్. ఇద్దరిద్దరి చొప్పున సేవ్ చేసుకుంటూ వచ్చారు కూడా. నిన్న షానీ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఫైమా, ఆదిరెడ్డి, రేవంత్, గీతూ, మెరీనా - రోహిత్, రాజ్, అభినయశ్రీ నామినేషన్స్ లో ఉన్నారు. అందరూ సేవ్ అయిపోయి చివరికి ఆదిరెడ్డి, అభినయశ్రీ మిగిలారు.
అదే నిజమైంది
బిగ్‌బాస్ నుంచి బైటికి వచ్చేసే కంటెస్టెంట్ పేరు ఒకట్రెండు రోజుల ముందే బైటికి వచ్చేస్తోంది. ఇలా జరగకూడదని షో నిర్వాహకులు ఎంత ట్రై చేసినా లీకుల్ని కంట్రోల్ చేయడం వారి వల్ల కావడం లేదు. ఈ వారమూ ఇదే జరిగింది. షానీ, అభినయశ్రీ ఎలిమినేట్ అవుతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. చివరికి అదే నిజమైంది. మొదటి రోజున షానీ, రెండో రోజు అభినయ ఎలిమినేట్ అయిపోయారు. నిజానికి ఇది జెన్యూన్ ఎలిమినేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే షానీ, అభినయ చాలా డల్‌గా ఉన్నారు. ఎవరైనా గొడవపడినప్పుడు మధ్యలో ఎవరో ఒకరి తరఫున మాట్లాడటం తప్ప హౌస్‌లో అభినయ చేసిందేమీ లేదు. ఇక షానీ అయితే అది కూడా చేయలేదు. ఎప్పుడూ నోరు మెదపలేదు. టాస్కుల్లో హుషారుగా పాల్గొనలేదు. అసలు ఎందుకు హౌస్‌కి వచ్చాడో ఎవరికీ అర్థమయ్యిందీ లేదు. అందుకే వీరికి ఓట్లు తక్కువ పడ్డాయి. వారి అడుగులు హౌస్‌ నుంచి బయటకు పడ్డాయి.
హౌస్‌ నుంచి ఎగ్జిట్ అయ్యి బిగ్‌బాస్ స్టేజ్‌ మీదికి వచ్చింది అభినయశ్రీ. తన జర్నీని చూసి కాస్త ఎమోషనల్ అయ్యింది. అందుకే ఆట మొదట్నుంచీ ఆడాలి, లేదంటే ఇలాగే ఉంటుంది, షానీ, నువ్వు తప్పు చేశారని నాగ్‌ అంటే అవునని ఒప్పుకుంది. ఆ తర్వాత హౌస్‌లో ఐదుగురు నిజాయతీ గల కంటెస్టెంట్స్ పేర్లు చెప్పమని నాగ్ అడిగారు. అప్పుడామె ఫైమా, చంటి, శ్రీసత్య, బాలాదిత్య, సూర్యల పేర్లు చెప్పింది. ఫైమాతో తనకు ఏర్పడిన బాండ్‌ గురించి చెప్పి, వదిలి వెళ్తున్నందుకు బాధపడింది. చంటి కామెడీ తనకెంత పెద్ద రిలీఫో వివరించింది. శ్రీసత్య లైఫ్‌లో దెబ్బ తిని అలా ఉంది తప్ప చాలా స్ట్రాంగ్ అని, ఆమెకి వెన్నుపోటు పొడవడం తెలియదని అంది. మంచి కొడుకు, తండ్రి, స్నేహితుడు, గొప్ప వ్యక్తి అంటూ బాలాదిత్యకి కితాబిచ్చింది. సొంత తమ్ముడు కూడా ఇవ్వనంత అభిమానాన్ని సూర్య తనకి ఇచ్చాడని, అతనెప్పుడూ తన లైఫ్‌లో ఉంటాడని చెప్పింది. ఆ తర్వాత నిజాయతీ లేని ఐదుగురు ప్లేయర్స్ పేర్లు చెప్పమని నాగ్ అడిగితే.. ముందుగా రేవంత్ పేరు చెప్పింది. అతను చాలా కన్నింగ్ అని, ఫేక్‌గా ఆడతాడని, ఆ విషయం అతని ముఖమ్మీదే అన్నానని చెప్పిన అభినయశ్రీ.. అతను తప్ప ఇంట్లో ఫేక్‌గా ఆడేవాళ్లు ఎవరూ లేరని, అందరూ మంచివాళ్లేనని, అందుకే ఇక ఎవరి పేర్లూ చెప్పలేననీ అంది. గీతూని మాత్రం బ్రేవ్ గాళ్ అంటూ మెచ్చుకుంది. ఎవరు ఏమన్నా తను ఆట ఆడి తీరుతుందని, చాలా స్ట్రాంగ్ అని, టాప్‌ 3లో తప్పకుండా ఉంటుందని చెప్పి వెళ్లిపోయింది.
మొత్తానికి మొదటి వీకెండ్‌లో ఎలిమినేషన్ లేకుండా చేసి.. సెకెండ్ వీకెండ్‌లో ఇద్దరిని పంపించేశారు. దీనికి కారణం ఉంది. ప్రతిసారి కంటే ఈసారి షోకి తక్కువ టీఆర్పీ వస్తోంది. ఎందుకో తెలీదు కానీ లాంచింగ్ ఎపిసోడ్‌కి కూడా ఎప్పుడూ వచ్చేంత టీఆర్పీ రాలేదు. కంటెస్టెంట్లు సగంమంది డల్‌గా ఉండటంతో డైలీ ఎపిసోడ్స్ కూడా అంతంత మాత్రంగానే టీఆర్పీని రాబడుతున్నట్టు తెలిసింది. ఇలాగే వదిలేస్తే పూర్తిగా పడిపోతుందనే ఉద్దేశంతోనే నిన్నటి ఎపిసోడ్‌లో నాగ్‌ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారని, కంటెస్టెంట్లని ఆటలోకి నెట్టే ప్రయత్నం చేశారని అంటున్నారు. డల్‌గా ఉన్న ఇద్దరు కంటెస్టెంట్లని ఒకేసారి తగ్గించడానికి కూడా ఇదే కారణమట. మసాలా పెంచడానికి రేపు ఒక సూపర్బ్ టాస్క్ పెట్టినట్టు ప్రోమోలోనూ చూపించారు. కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు ఫైర్ అవుతున్నారు. గీతూ, ఇనయాలైతే కాస్త గీత దాటి 'దొబ్బెయ్' అని తిట్టుకుంటూ నిప్పులు చెరుగుతున్నారు. వీరి మధ్య అంత మంట పెట్టిన ఆ టాస్క్ ఏమిటో రేపు చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: