శ్రీముఖి నెల సంపాదన తెలిస్తే మైండ్ పోవాల్సిందే?

Purushottham Vinay
తెలుగు బుల్లి తెరపై స్టార్ హీరోయిన్ స్థాయిలో స్టార్ డం దక్కించుకున్న ముద్దుగుమ్మ శ్రీ ముఖి. బుల్లి తెర రాములమ్మ అంటూ ఈమెకి మంచి పేరు కూడా వుంది. దానికి కారణం ఆమె రాములమ్మ సిగ్నేచర్ స్టెప్. ఆ స్టెప్ తో ఒక్కసారిగా ఆమె బుల్లితెర రాములమ్మగా స్టార్ హీరోయిన్లతో సమానంగా క్రేజ్ దక్కించుకుంది.బుల్లి తెర లేడీస్ సూపర్‌ స్టార్ అంటూ శ్రీముఖిని పిలుస్తూ ఉంటారు.అంతటి భారీ క్రేజ్ తో గుర్తింపు దక్కించుకున్న శ్రీముఖి ఆదాయం విషయంలో ఇతర యాంకర్స్ కంటే ఎక్కువ తీసుకుంటూ వారికి అందనంత దూరంలో ఉంటుంది. సీనియర్ యాంకర్ సుమకి దాదాపుగా సమానమైన పారితోషకమును తీసుకునే శ్రీముఖి నెలకు దాదాపుగా పది లక్షల రూపాయల వరకు సంపాదిస్తుంది అంటూ బుల్లి తెర వర్గాల ద్వారా సమాచారం తెలుస్తుంది.ఆ సంపాదనలో మెజారిటీ శాతం తన లగ్జరీ ఖర్చుల కోసం శ్రీముఖి ఎక్కువగా ఖర్చు చేస్తుందట. తమ్ముడితో కలిసి హైదరాబాదులో అత్యంత విలాసమైన ఒక ఇంట్లో నివాసం ఉంటున్న శ్రీ ముఖి రెగ్యులర్ గా పార్టీలు అంటూ లైఫ్ ని బాగానే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.


తన స్నేహితులతో ఎక్కువగా విదేశీ ట్రిప్ లు హాలీడే ట్రిప్స్‌ వేసే ఈ అమ్మడు నెలలో సంపాదించిన దాంట్లో దాదాపుగా సగానికి పైగా ఖర్చు చేస్తుందట. రాయల్ లైఫ్ ఎంజాయ్ చేసిన శ్రీ ముఖి ని చూసి ఇతర సెలబ్రిటీలు కూడా కుళ్లుకునే స్థాయిలో ఆమె లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది అంటూ బుల్లి తెర వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు.ఆమె సోషల్ మీడియా ద్వారా కూడా బాగా సంపాదిస్తుంది.ఆమె యూట్యూబ్ ఛానల్ ద్వారా బాగా సంపాదిస్తుంది.ఆమె ఛానల్ చూస్తే ఆమె ఏ రేంజ్ లో ఖర్చు చేస్తుందో ఏ రేంజ్ లో ఎంజాయ్ చేస్తుందో మనం చూడవచ్చు. రెగ్యులర్ గా షోలు ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండే ఆమె ఎంజాయ్మెంట్ ని మాత్రం మిస్ అవ్వదు. లైఫ్ అంటే అలా ఉండాలని చాలా మంది శ్రీముఖిని చూసి అనుకుంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: