తన లుక్ తో అందర్నీ భయపెట్టేసిన సీతారామం హీరోయిన్..!!

Divya

హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్, స్వప్న దత్ నిర్మాతలుగా వ్యవహరించిన తాజా చిత్రం సీతారామం. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా,  మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించారు. ఇక ఈ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . యుద్ధంతో రాసిన ప్రేమ కథ అంటూ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.  ఇక ఈ సినిమాలో సీత పాత్రలో నటించిన మృణాల్ కి  అద్భుతమైన నటనతో అందంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఈమె పేరు తరచూ వినిపిస్తూ వస్తోంది.  ఇక ఈ సినిమాలో ఈమె నటనపై ఇప్పటికే పలువురు ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ ముద్దుగుమ్మను ఫాలో అయ్యే అభిమానులు కూడా పెరిగిపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా అదే జోష్ తో హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ మరింత పాపులారిటీని సంపాదించుకుంటుంది.  ఇకపోతే ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో మృణాల్ ఠాకూర్ పేరు కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా మృణాల్ ఠాకూర్ కి సంబంధించిన ఒక పాత ఫోటో సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతోంది.. ఈ ఫోటోని చూస్తుంటే ఇప్పుడున్న మృణాల్.. అప్పుడు ఉన్న మృణాల్ ఒక్కరేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఇక చేతులు, ముఖం, కళ్ళు మొత్తం నల్లగా ఉండడంతో పాటు కంటి కింద నల్లటి వలయాలు కూడా వచ్చాయి. ఇక ఈమె తన చేతుల్ని పైకెత్తి చూపిస్తూ ఉంది. ఇక వేలి గోర్లు కూడా మట్టితో నిండిపోయాయి ప్రస్తుతం ఈ ఫోటో చూసిన ఆమె అభిమానులంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఫోటోను చూసిన నెటిజన్స్ కూడా మృణాల్ ఠాకూర్ కి.. ఇక్కడ కనిపిస్తున్న ఆమెకు అసలు పోలికే లేదంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఈ ఫోటోపై ఒక్కొక్కరు ఒక్కో రకమైన అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: