ట్రోలింగ్ పై స్పందించి కన్నీళ్లు పెట్టుకున్న సునీత?

Purushottham Vinay
ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఈమె ఎన్నో సినిమాలకు ప్లే బ్యాక్ సింగర్ గా వ్యవహరించడమే కాకుండా ఇంకా ఎంతో మంది హీరోయిన్లకు కూడా తన చక్కటి వాయిస్ తో డబ్బింగ్ చెబుతూ ప్రేక్షకులను సందడి చేశారు.ఇక ఇలా తన అద్భుతమైన గాత్రంతో ఎంతోమందిని మైమరిపించిన సునీత వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈమె మొదటి భర్త వదిలేయడంతో పిల్లలు బాగోగులు చూసుకుంటూ ఒంటరిగా గడుపుతున్నారు.ఇలా పిల్లలతో కలిసి ఒంటరిగా తన ప్రయాణం కొనసాగిస్తున్న ఈమె జీవితంలోకి తన స్నేహితుడు మ్యాంగో మ్యూజిక్ అధినేత రామ్ వీరపనేని వచ్చారు.తన పిల్లల అనుమతితో ఈమె రామ్ వీరపనేని అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకున్నారు. అయితే సునీత రెండవ వివాహం చేసుకున్న సమయంలో ఆమె గురించి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇలా తన గురించి ఎవరు ఎలాంటి విమర్శలు చేసిన ఈమె వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఈమె తాను రెండవ పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.


ఇకపోతే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సునీతకి గతంలో తన గురించి నెటిజన్స్ చేసిన ట్రోలింగ్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.ఇలా మీ రెండవ పెళ్లి గురించి వచ్చిన ట్రోలింగ్స్ పై మీ సమాధానం ఏంటి అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సునీత సమాధానం చెబుతూ ఎమోషనల్ అయ్యారు.మీరందరూ అంటూ ఉంటారు కదా.. చిత్ర గారి తరువాత 121 మందికి డబ్బింగ్ చెప్పారు అని ఇలా మీరందరి ఎంటర్టైన్మెంట్ కు నేనే కారణమని అంటూ ఉంటారు.ఇలా నాలో ఇన్ని మంచి విషయాలు ఉన్నప్పుడు నా వ్యక్తిగత జీవితం పై ఫోకస్ చేస్తూ గొంతు లేపుతున్నారు. సంస్కారవంతుల లక్షణం ఇది కాదు. సంస్కారవంతులు ఎప్పుడూ కూడా ఒక మనిషి గురించి ఒక మాట మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడుతారు అంటూ ఈమె కన్నీళ్లు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: