బాలీవుడ్ సినిమా గా పూరీ జనగణమన!!

P.Nishanth Kumar
డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చిరకాల కల జనగణమన సినిమా తెరకెక్కడానికి ఎంతో ఇబ్బందులు ఏర్పడడం అయన అభిమానులను నిరాశపరుస్తుంది. వాస్తవానికి ఈ సినిమా చేయడానికి అయన చాలా ప్రయత్నాలు గతంలో చేశారు. మహేష్ బాబు తో, వెంకటేష్ లతో ఈ సినిమా చేయడానికి అయన ప్రయత్నాలు చేశారు. అప్పటినుంచి ఈ ప్రాజెక్ట్ కు సరైన ముహూర్తం కుదరడం లేదు. ఈ నేపథ్యం లో ఈ సినిమా ఎప్పుడు చేస్తాడో చూడాలి. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఈ దర్శకుడు లైగర్ అనే సినిమా చేశాడు.
ఇటీవలే  ప్రేక్షకుల ముందుకు వచ్చిన మొదటి సినిమా "లైగర్" పెద్దగా విజయం సాధించలేదు.  స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచి డిజాస్టర్ టాక్ ను అందుకుంటూ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలకి ముందే జనగణమన సినిమా ను చేయాలనీ నిర్ణయించారు. అయితే ఫలితం సరిగ్గా రాకపోవడంతో ఈ సినిమా ను క్యాన్సల్ చేయక తప్పలేదు.  ఇప్పుడు ఈ సినిమా ను బాలీవుడ్ సినిమా గా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఓ బాలీవుడ్ పెద్ద హీరో తో ఈ సినిమా చేయాలనీ పూరీ ఆలోచిస్తున్నాడట. అయితే ఇప్పటివరకు ఎవరితో ఆ సినిమా అన్నది ఇంకా తెలియరాలేదు. మంచి కథే అయినా కూడా విజయ్ దేవరకొండ కు అది సూట్ కాదని భావించడం వల్లే ఈ సినిమా ను చేయడం లేదు పురీ.. మరి ఈ సినిమా చేసే ఆ బాలీవుడ్ స్టార్ ఎవరో చూడాలి. త్వరలోనే దానికి సంబంధించి న్యూస్ రాబోతుంది. గత కొన్ని రోజులుగా పూరీ ఇస్మార్ట్ శంకర్ సినిమా చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్న నేపథ్యములో ఈ సినిమా లైన్ లోకి రావడం నిజంగా మంచి విషయమే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: