మీనా పై మండిపడుతున్న నెటిజన్స్ ఎందుకో తెలుసా..?

murali krishna
తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో అగ్ర హీరోలందరి సరసన నటించిన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది మీనా.


ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. కాగా పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయిన మీనా ఆ తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా మొదలుపెట్టి అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఇక అప్పట్లోనే తన అందచందాలతో కొన్నేళ్లపాటు ఇండస్ట్రీని షేక్ చేస్తూ వరుస ఆఫర్లతో దూసుకుపోయింది. తన కెరీర్లో మీనా ఎన్నో గ్లామరస్ పాత్రలను చేసి నటించి ప్రేక్షకులను మెప్పించింది. కాగా ఇటీవలే మీనా భర్త మరణించిన సంగతి తెలిసిందే. ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే మీనా తేరుకొని తన ఫ్యామిలీ ని చూసుకుంటూ మరొకవైపు సినిమాలలో కూడా నటిస్తోంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సెప్టెంబర్ 16 న మీనా తన 46 పుట్టినరోజు వేడుకలు జరుపుకుందట.. ఇకపోతే నటి మీనా కు సినీ ఇండస్ట్రీలో చాలామంది స్నేహితులు ఉన్నారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా తనతో పార్టీ కలిసి నటించిన తోటి హీరోయిన్స్ అందరూ కూడా మీనాకు స్నేహితులుగా స్నేహాన్ని కంటిన్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా పలువురు ఒకప్పటి హీరోయిన్లు అయినా రమ్యకృష్ణ, సంగీత, సంఘవి, శ్రీదేవి విజయ్ కుమార్, స్నేహ, రేణుక ప్రవీణ్ ఇలా కొంతమంది సోషల్ మీడియా వేదికగా విష్ చేసారట.


అంతేకాకుండా ఇంకొందరు మీనా ఇంటికి వెళ్లి తన బర్త్డే సెలబ్రేషన్స్ లో పాల్గొని సందడి సందడి చేశారు. ఇక బర్త్ డే లో తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలను కూడా మీనా  తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మీనా బర్త్ డే కి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో ఒకప్పటి హీరోయిన్లు కొంతమంది కనిపించడంతో ఆ ఫోటోలను చూసిన అభిమానులు అందరూ ఇలా ఒకే ఫ్రేమ్ లో కనిపించడం చాలా ఆనందంగా ఉంది అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: