బిగ్ బాస్ బ్యూటీకి ఖరీదైన కార్ గిఫ్ట్?

Purushottham Vinay
నేడు సెప్టెంబర్ 15 వ తేదీ అషురెడ్డి బర్త్ డే. అషు రెడ్డి పెద్ద హీరోయిన్ కాకపోవచ్చు. కనీసం స్మాల్ స్క్రీన్ యాక్టర్ కూడా కాదు. అయినా కానీ ఈమెకు ఇంస్టాగ్రామ్ లో 10 లక్షల పైగా ఫాలోవర్స్ వున్నారు. ఇక ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఫ్రెండ్స్, ఫ్యాన్స్ బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.అయితే ఈ బర్త్ డేకు ఆమెకు ఖరీదైన బహుమతి దక్కింది. మెర్సిడెజ్ బెంజ్ కోప్ ని ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఈ మోడల్ ధర రూ. 72 లక్షలకు పైగా ఉంది. ఇకపై అషురెడ్డి లగ్జరీ కారులో చక్కర్లు కొట్టనుంది. ఆ వైట్ లగ్జరీ కార్ పక్కన స్టైలిష్ ఫోజులిస్తూ అషురెడ్డి నిల్చుంది.ఆ ఖరీదైన గిఫ్ట్ అషురెడ్డికి వాళ్ళ నాన్న ఇచ్చారు. ఆ విషయాన్ని అషురెడ్డి స్వయంగా తెలియజేసింది. ఇంస్టాగ్రామ్ లో తన కొత్త కారు ఫోటోలు అషురెడ్డి పోస్ట్ చేశారు. ఆ ఫొటోల్లో అషురెడ్డి ఫాదర్ కూడా ఉన్నారు. అషురెడ్డి బెంజ్ కారు కొనడంపై నెటిజెన్స్ పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.ఇక బుల్లితెర షోస్ లో అషురెడ్డి సందడి చేస్తున్నారు. అదే ఆమె కెరీర్ గా ఉంది.


 బిగ్ బాస్ సీజన్ 3 లో అషురెడ్డి పాల్గొన్నారు. హౌస్ లో గ్లామర్ తో రెచ్చిపోయినా కానీ మైలేజ్ రాలేదు. ఆమె కొద్దివారాలకే చాప చుట్టేసింది. అలాగే ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా అషురెడ్డి పాల్గొన్నారు. అక్కడ కూడా ఆమెకు కలిసి రాలేదు.ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తుంది. తరచుగా బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నారు. అషురెడ్డి గ్లామరస్ ఫోటోలు తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి. అలాగే అషురెడ్డి తన యూట్యూబ్ ఛానల్ లో ఆసక్తికర వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఎంత ప్రయత్నం చేసినా ఆమెకు కోరుకున్న గుర్తింపు రావడం లేదు. కనీసం ఒక యాంకర్ గా కూడా ఎదగలేకపోతుంది. తను ఎక్కువగా ట్రోల్స్ ఎదురుకుంటూ ఫేమస్ అవుతుంది. ప్రతి విషయంలో కూడా అషు రెడ్డిని సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లతో తెగ ట్రోల్ చేస్తుంటారు నెటిజన్స్. అయినా కానీ ఆమె అవేమి పెద్దగా పట్టించుకోదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: