రణవీర్ న్యూడ్ ఫోటో షూట్ కేసులో భారీ ట్విస్ట్..?

Anilkumar
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్  గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.ఇదిలావుంటే ఇక సామాజిక మాధ్యమాల్లో నగ్న ఫొటోలు పోస్ట్‌ చేసిన వ్యవహారంలో బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌సింగ్కు పోలీసులు కొద్ది రోజుల క్రితం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.ఇక దీంతో అతడు ఆగస్టు 29న పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. కాగా అతడి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. అయితే ఇక తాజాగా ఆ స్టేట్మెంట్లో రణ్వీర్ ఏం చెప్పాడో పోలీసులు వెల్లడించారు.ఇదిలావుంటే  ఈ న్యూడ్ ఫొటోస్ ఓ ట్విస్ట్ చోటు చేసుకుందని అన్నారు.

అంతేకాదు తాను పోస్ట్ చేసిన నగ్న ఫొటోల్లో ఒకటి మార్ఫింగ్ చేశారని రణ్వీర్ చెప్పారట. ఇక ఈ విషయాన్ని అధికారులు తెలిపారు. అయితే తాను పోస్ట్ చేసిన ఆ న్యూడ్ ఫొటోలో అండర్వేర్ వేసుకున్నట్లు రణ్వీర్ చెప్పినట్లు వెల్లడించారు.కాగా  ఆ ఫొటో మార్ఫింగ్ చేశారని పోలీసులతో రణ్వీర్ చెప్పారట! అయితే ఇక దీనిపై తాము దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇకపోతే ఆ ఫొటో మార్ఫింగ్ అయిందా లేదా అని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించినట్లు చెప్పారు.రణ్‌వీర్‌ తన నగ్న ఫొటోలను పోస్ట్‌ చేయడం ద్వారా

 మహిళల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడంతో పాటు వారిని అవమానపరిచారంటూ ఓ ఎన్జీవోతో పాటు ఓ మహిళా న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక దీంతో అధికారులు కేసు నమోదు చేసి రణ్వీర్ను విచారణకు పిలిచి దర్యాప్తు చేస్తున్నారు.ఇదిలావుంటే ఇక రణవీర్ సినిమాల విషయానికొస్తే.. సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గతంలో వచ్చిన అపరిచితుడు సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. అయితే ఈ రీమేక్ ని కూడా శంకర్ దర్శకత్వం వహించడం విశేషం. ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ తో భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న శంకర్.. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన అనంతరం రణవీర్ తో అపరిచితుడు రీమేక్ ని సెట్స్ పైకి తీసుకెళ్లాడున్నాడు....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: