నాగార్జున 100వ మూవీ లో అఖిల్..?

Pulgam Srinivas
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇది ఇలా ఉంటే అక్కినేని నాగార్జున 100 వ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది . అక్కినేని నాగార్జున 100 వ మూవీ కి మోహన్ రాజా దర్శకత్వం వహించ బోతున్నట్లు ,  అలాగే ఈ మూవీ లో నాగార్జున కుమారుడు అఖిల్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించ బోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది .

ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. నాగార్జున తాజాగా బ్రహ్మాస్త్రం అనే హిందీ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు . ఈ మూవీ సెప్టెంబర్ 9 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది . ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించ బడుతుంది .  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగార్జున ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం లో తెరకెక్కిన ది ఘోస్ట్ మూవీ లో హీరోగా నటించాడు . ఈ మూవీ లో సోనాల్ చౌహాన్ , నాగార్జున సరసన హీరోయిన్ గా నటించింది .

ఈ మూవీ అక్టోబర్ 5 వ తేదీన విడుదల కాబోతుంది . ఈ మూవీపై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టు కున్నారు .  అలాగే ప్రస్తుతం దర్శకుడు మోహన్ రాజా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ కి దర్శకత్వం వహించాడు . ఈ మూవీ లో సల్మాన్ ఖాన్ , సత్య దేవ్ ,  నయన తార ముఖ్య పాత్రలో నటించారు. ఈ మూవీ అక్టోబర్ 5 వ తేదీన విడుదల కాబోతోంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: