పవన్ ని లేపడం కోసం ఆ హీరోలను కించపరచడం అవసరమా బండ్లన్న..?

Anilkumar
బండ్ల గణేష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే ఈయన  ఎప్పుడు ఎలాంటి ట్వీట్ చేస్తారో అంచనా వేయడం కష్టం.ఇక  ఈ పవన్ భక్తుడి చర్యలు ఊహాతీతం. అయితే  ఇక కొన్ని విషయాలు బండ్ల గణేష్ నిర్మొహమాటంగా మాట్లాడేస్తారు.అంతేకాదు మరికొన్ని సందర్భాల్లో బండ్ల ట్వీట్స్ ఎవరినో ఒకరిని గెలికేలా ఉంటాయి.అయితే  ఈ మధ్య మంత్రి కేటీఆర్ ని పొగుడుతూ ట్వీట్ వేశారు.ఇక  ఆ ట్వీట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో మంట రేపింది.ఇకపోతే ఎన్టీఆర్ గెస్ట్ గా వస్తున్నాడనే నెపంతో బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఇదిలావుంటే ఇటీవల బీజేపీ అగ్రనేత అమిత్ షాను ఎన్టీఆర్ కలిసిన నేపథ్యంలో కేసీఆర్ గవర్నమెంట్ ఎన్టీఆర్ పై ఇలా కక్ష సాధించిందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

ఇక ఈ క్రమంలో కేసీఆర్, కేటీఆర్ లపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. కాగా ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ ని ఎలివేట్ చేస్తూ ఇద్దరు యంగ్ హీరోలను బండ్ల గణేష్ కించపరిచారు.అయితే  వారిని సంస్కారం తెలియని వాళ్ళుగా చిత్రీకరించారు. ఇక ఓ వేడుకలో యంగ్ హీరోలు అడివి శేష్, సిద్దు జొన్నలగడ్డ కూర్చున్న విధానాన్ని ఆయన తప్పుబట్టారు.ఇకపోతే  వారిద్దరూ కూర్చొన్న ఫొటోలతో పాటు ఇతర ఈవెంట్స్ లో పవన్ కళ్యాణ్ కూర్చున్న ఫోటోలు పోస్ట్ చేసిన బండ్ల గణేష్... ''సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం మా దేవర దయచేసి నేర్చుకోండి ఆచరించండి అది మన ధర్మం'' అని కామెంట్ చేశాడు.

అయితే బండ్ల గణేష్ పోస్ట్ చేసిన ఆ ఫొటోల్లో పవన్ కళ్యాణ్ చేతులు కట్టుకొని కూర్చొని ఉండగా... అడివి శేష్, సిద్దు జొన్నలగడ్డ కాలుపై కాలేసుకుని కూర్చున్నారు. ఇక నిజానికి ఆ ఇద్దరు కూర్చున్న విధానంలో ఎలాంటి తప్పులేదు. ఇదిలావుంటే సాధారణంగా పెద్దవారు పక్కన లేనప్పుడు అలా కూర్చోవడంలో తప్పు లేదు. ఇకపోతే పవన్ ని ఎలివేట్ చేయడం కోసం లేని తప్పు వెతికి సంస్కారహీనులుగా వాళ్ళను చిత్రీకరించడం దారుణమని కొందరి అభిప్రాయం.కాగా  పవన్ కళ్యాణ్ కటాక్షం కోసం ఆయన్ని పొగిడితే సరిపోతుంది. ఇక ఇలా ఇతరుల గౌరవాన్ని తగ్గించి ఆయన్ని లేపాల్సిన అవసరం ఏముందని అంటున్నారు. బండ్ల గణేష్ లేటెస్ట్ మూవీ డేగల బాబ్జీ ఓటీటీలో నేరుగా విడుదల చేశారు. అయితే పవన్ బర్త్ డే కానుకగా సెప్టెంబర్ 2 నుండి ఆహాలో డేగల బాబ్జీ స్ట్రీమ్ అవుతుంది.ఇక  తన చిత్రాన్ని చూసి ఆదరించాలని బండ్ల గణేష్ విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా తమిళ్ రీమేక్ గా తెరకెక్కిన డేగల బాబ్జీ చిత్రం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: