'బాయ్ కాట్' ట్రెండ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నాగార్జున..?

Anilkumar
ప్రస్తుతం ఇప్పుడు తమకు నచ్చని హీరో హీరోయిన్లు లేదంటే దర్శక - నిర్మాతలు తీసిన సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంటే, కొంత మంది సోషల్ మీడియాలో బాయ్‌కాట్‌ పిలుపు ఇస్తున్నారు.ఇకపోతే ఇటీవల ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా', అక్షయ్ కుమార్ 'సామ్రాట్ పృథ్వీరాజ్' తదితర హిందీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో బాయ్‌కాట్‌ ప్రభావం అని కొందరు అనుకున్నారు.ఇకపోతే 'భూల్ భులయ్యా 2', 'బ్రహ్మాస్త్ర' సినిమాలు భారీ వసూళ్లు సాధించాయి. అయితే బాయ్‌కాట్‌ ట్రెండ్ ఈ సినిమాలపై ప్రభావం చూపించలేకపోయింది. ఇక ఈ నేపథ్యంలో కంటెంట్ ఉన్న సినిమాలు విజయాలు సాధిస్తాయనే నమ్మకం పెరిగింది.

 కాగా కింగ్ అక్కినేని నాగార్జున కూడా అదే మాట అంటున్నారు.అయితే ''బాయ్‌కాట్‌ ట్రెండ్ సినిమా ఇండస్ట్రీపై అంతగా ప్రభావం చూపిస్తుందని నేను అనుకోవడం లేదు.ఇక 'లాల్ సింగ్ చడ్డా' ఆడలేదు. అయితే , 'బ్రహ్మాస్త్ర' ఆడింది కదా! అంతకు ముందు ఆలియా భట్ నటించిన 'గంగూబాయి కతియావాడి', 'భూల్ భులయ్యా 2', 'జగ్ జగ్ జుయో' సినిమాలు ఆడాయి కదా!'' అని నాగార్జున పేర్కొన్నారు.ఇదిలావుంటే  'బ్రహ్మాస్త్ర' మంచి విజయం సాధించడంతో పాటు తన పాత్రకు పేరు రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు చాలా సింపుల్‌గా ఆయన బాయ్‌కాట్‌ ట్రెండ్‌ను తీసి పారేశారు.

ఇదిలావుంటే ఇక 'బ్రహ్మాస్త్ర'కు భారీ వసూళ్లు వస్తున్న నేపథ్యంలో ' బ్రహ్మాస్త్ర 2 : దేవ్' సినిమాపై ఆసక్తి పెరిగింది.అయితే  మొదటి భాగంలో నంది అస్త్రంగా నాగార్జున కనిపించారు. ఇక ఆయన పాత్రకు ముగింపు కూడా ఇచ్చారు.ఆయన మరణించినట్లు చూపించారు.అయితే  మరి, రెండో భాగంలో ఆయన ఉంటారా? లేదా? దీనిపై నాగార్జున స్పందిస్తూ... ''బ్రహ్మాస్త్ర రెండు, మూడు భాగాలలో నా పాత్ర ఉంటుందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేను'' అని అన్నారు. అయితే...ఇక  మంచి పాత్రలు కంటిన్యూ అవుతాయని అనుకుంటున్నానని మరో మాట చెప్పారు.ఇక  దాంతో 'బ్రహ్మాస్త్ర 2'లో నాగార్జున ఉంటారని ఆశించవచ్చు.అంతేకాకుండా దర్శకుడు అయాన్ ముఖర్జీ తనకు ఏం చెప్పాడో... అదే తీశాడని నాగార్జున తెలిపారు. ఇకపోతే తన పాత్ర తెరపై కనిపించినంత సేపూ హ్యాపీగా అనిపించిందని అయాన్ తనతో చెప్పాడని ఆయన తెలిపారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: