ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన ఆది పురుష్ టీం...!!

murali krishna
బాహుబలి'(సిరీస్) తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు 'సాహో' 'రాధే శ్యామ్' పెద్దగా అయితే ఆడలేదు. ఈ సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా.. అప్డేట్ ల విషయంలో ప్రభాస్ అభిమానుల్ని నిరుత్సాహానికి గురిచేస్తూ వారి సహనానికి పరీక్షలు పెడుతూ వచ్చారు నిర్మాతలు.


ప్రభాస్ హిందీలో చేస్తున్న స్ట్రైట్ మూవీ 'ఆదిపురుష్' విషయంలో కూడా ఇదే జరుగుతుంది. 'తానాజీ' దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 'ఆదిపురుష్' మేకర్స్ కంటే 'సాహో' 'రాధే శ్యామ్' మేకర్స్ నయం అనుకుంటున్నారట ప్రభాస్ అభిమానులు.


ఎందుకంటే ఈ చిత్రం షూటింగ్లో భాగంగా తన పార్ట్ ను ఎప్పుడో కంప్లీట్ చేశాడు ప్రభాస్. కానీ ఇప్పటివరకు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేయలేదు.2022 జనవరి 12న 'ఆదిపురుష్' ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ కూడా ప్రకటించారు. రూ.500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాని మార్కెట్ చేసుకోవాలి అంటే 3 నెలల టైం తక్కువే అని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో 'ఆదిపురుష్' తెలుగు రైట్స్ ను యూవీ క్రియేషన్స్ వారు సొంతం చేసుకున్నారట.


అనే వార్త ప్రభాస్ అభిమానుల్ని మరింత అసహనానికి గురిచేస్తుందట.. అయితే కొంతలో కొంత ప్రభాస్ ఫ్యాన్స్ కు రిలీఫ్ ఇచ్చే న్యూస్ ఏంటి అంటే? 'ఆదిపురుష్' టీజర్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యిందని సమాచారం.. దసరా సందర్భంగా ఈ చిత్రం నుండి టీజర్ ను విడుదల చేయబోతున్నారట. అక్టోబర్ 3న 'ఆదిపురుష్' టీజర్ రిలీజ్ కాబోతున్నట్లు స్పష్టమవుతుంది.


త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం.. అంతేకాదు అక్టోబర్ నుండి జనవరి 12 వరకు 'ఆదిపురుష్' ప్రమోషన్లు గ్యాప్ లేకుండా నిర్వహించేందుకు మేకర్స్ రెడీ అయ్యారని తెలుస్తుంది.. అయితే పెదనాన్న పోయిన బాధలో ఉన్న ప్రభాస్ మొదటి నెల వరకు ప్రమోషన్లకి హాజరు కాకపోవచ్చు అని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారట .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: