'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ మరియు వేదిక ఖరారు..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస మూవీ లలో నటిస్తూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న యువ హీరో లలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఇప్పటికే ఈ హీరో ఈ సంవత్సరం సేభాష్టియన్ మరియు సమ్మతమే మూవీ లతో ప్రేక్షకులు పలకరించాడు. ఈ మూవీ లలో సెభాష్టియన్ మూవీ ప్రేక్షకులను నిరాశపర్చగా , సమ్మతమే మూవీ పర్వాలేదు అనే విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఈ హీరో ఈ సంవత్సరం మూడో మూవీ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు. తాజాగా ఈ హీరో నేను మీకు బాగా కావాల్సిన వాడిని అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 16 వ తేదీన విడుదల చేయనున్నారు. కోడి దివ్య నిర్మించిన ఈ మూవీ కి శ్రీధర్ గాడే దర్శకత్వం వహించాడు.

సంజన ఆనంద్ ఈ మూవీ లో కిరణ్ అబ్బవరం సరసన హీరోయిన్ గా నటించిగా , ఈ మూవీ కి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించాడు.  ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించ బోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని సెప్టెంబర్ 16 వ తేదీన విడుదల చేయనున్న నేపథ్యంలో సెప్టెంబర్ 14 వ తేదీన ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనుంది. ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను జే ఆర్ సి కన్వెన్షన్స్ , హైదరాబాద్ లో సెప్టెంబర్ 14 వ తేదీన సాయంత్రం 6 గంటలకు నిర్వహించనుంది. ఈ మూవీ తో కిరణ్ అబ్బవరం బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: