టైం ట్రావెల్ ఉంటే చాలు.. సినిమా సూపర్ హిట్టే!!

P.Nishanth Kumar
ఇటీవలే కాలంలో ప్రేక్షకుల అభిరుచులు ఏవిధంగా మారాయి అంటే అసలు మంచి కాన్సెప్ట్ లేకుండా ఉంటే ఎంతటి సినిమాని అయినా వారు రిజెక్ట్ చేస్తున్నారు. దాంతో హీరో లు జాగ్రతగా సదరు సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కథ ల విషయంలో దర్శకులకు చుక్కలు చూపిస్తున్నారు. అలా తాజాగా టైం ట్రావెల్ సినిమాలకు డిమాండ్ బాగా ఉన్నట్లు తెలుస్తుంది. నెలరోజుల వ్యవధిలో వచ్చిన రెండు టైం ట్రావెల్ సినిమాలు ప్రేక్షకులను మెచ్చడం జరగడంతో ఈ సినిమాలు చేయడానికి అందరు ఆసక్తి చూపిస్తున్నారు.
కాలంతో ప్రయాణించి గతంలోకి వెళ్లి జరిగిపోయిన సంఘటనలని మళ్ళీ మార్చే ప్రయత్నం చేయడం అనే కాన్సెప్ట్ ఎప్పుడైనా మంచి కాన్సెప్ట్. ఇలాంటివి గతంలో ఎక్కువగా హాలీవుడ్ లో కనిపించేవి. మనవాళ్ళు ఈ సినిమా చేయడానికి పెద్దగా ముందుకు వచ్చే వారుకాదు. బయట సాధ్య పాడకపోయినా ఇలాంటి కథలను వెండితెరపై దర్శకుల క్రియేటివిటీకి ఏదైనా సాధ్యమే కాబట్టి తెరపై ఇలాంటి కథలని చూడగలుగుతున్నాం. అలా ఈ తరం వారికి బాగా నచ్చే కాన్సెప్ట్ కాబట్టి అందరికి బాగా నచ్చుతున్నాయి. కళ్యాణ్ రామ్ నటించిన బింబి సారా అలాగే శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా లలాగే సినిమా చేయడానికి హీరోలు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
1991లో సింగీతం శ్రీనివాసరావు మొదటి సారి తెలుగులో టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఆదిత్య369 సినిమాని తెరకెక్కించారు. బాలకృష్ణ హీరో గా నటించిన ఈ సినిమా అందరిని ఎంతో ఆకట్టుకుంది. అయితే ఆ సినిమా కమర్షియల్ గా హిట్ కాకున్నా ఆ రోజుల్లో ప్రయోగాత్మక చిత్రంగా మన్ననలు అందుకుంది. అప్పట్లో ప్రేక్షకులు ఈ సినిమా ను చూసి ఆశ్చర్య పోయారు. అయితే అలాంటి తరహా కాన్సెప్ట్ మళ్ళీ రాలేదనే చెప్పాలి. మధ్య సూర్య 24 సినిమా తో ట్రై చేసినా ఎందుకో వర్క్ అవుట్ కాలేదు. దానికి సరైన నేపథ్యం లేకపోవడం సినిమా ఆవిధంగా అయిపొయింది అని చెప్పొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలు రావడం నిజంగా ఆనంద్ పరుస్తుంది టాలీవుడ్ సినిమాలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న కాన్సెప్ట్లు చేయడం మంచి విషయం అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: