పొన్నియిన్ సెల్వన్1: భారీ ధరకు ఓటిటి హక్కులు?

Purushottham Vinay
వరుస ప్లాపులతో సతమతం అవుతూ దీర్ఘకాలం విరామం తరువాత ప్రముఖ సీనియర్ లెజెండరీ అండ్ క్లాసిక్ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా పొన్నియన్ సెల్వన్ సినిమా ఓటీటీ హక్కులు రికార్డు స్థాయి ధరకు అమ్ముడయ్యాయి.చోళుల స్వర్ణయుగం గురించి చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. ఇప్పుడీ చరిత్ర కళ్లముందు కన్పించనుంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న ఎపిక్ పీరియాడిక్ యాక్షన్ సినిమాలో విక్రమ్, కార్తి, జయం రవిలు కీలక పాత్రల్లో కన్పించనున్నారు. సెప్టెంబర్ 30న విడుదల కానున్న పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 ఓటీటీ హక్కులు అప్పుడే అమ్ముడైపోయాయి.ఈ సినిమాను కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా రూపొందించారు. సినిమా విడుదలకు ముందే సినిమా ఓటీటీ హక్కుల్ని భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. 


పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1, 2 రెండింటినీ కలిపి 125 కోట్లకు అమెజాన్ ప్రైమ్ కైవసం చేసుకుంది. ఇక డిజిటల్ హక్కుల్ని సన్ టీవీ దక్కించుకుంది.ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభితలు ఇతర ప్రధాన పాత్రల్లో కన్పించనున్నారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాల్ని భారీగా పెంచింది. ఓటీటీ హక్కుల్ని ఇంత భారీ స్థాయిలో చేజిక్కించుకోవడం గమనార్హం.ఈ సినిమా బాహుబలి అంత పెద్ద హిట్ అవుతుందని మూవీ టీం ఇంకా తమిళలు భావిస్తున్నారు.కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ విజువల్ గా ఆకట్టుకున్నప్పటికి అంత క్యూరియాసిటి అయితే కనపడలేదు. పైగా ఈ సినిమాని బాహుబలితో పోల్చడం ఏంటంటూ అనేక రకాల విమర్శలు కూడా వచ్చాయి.కానీ సినిమా ఎలా ఉంటుందో కేవలం ట్రైలర్ చూసి చెప్పలేము. సినిమా రిలీజ్ అయితే తప్ప. మరి మణి రత్నం తన డ్రీం ప్రాజెక్ట్ తో ఎలా మెస్మరైజ్ చేసాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: