రాసి కన్నా పరిస్థితి ఇలా ఉందేంటి..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని , మంచి క్రేజ్ ను అందుకున్న అతి కొద్దీ మంది ముద్దు గుమ్మ లలో రాశి కన్నా ఒకరు. ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఊహలు గుసగుసలాడే మూవీ తో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు రాశి కన్నా అందచందాలకు నటనకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించడంతో రాశి ఖన్నా కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస అవకాశాలు దక్కాయి.

అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ అనేక మూ వీలలో నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాత్రం రాశి కన్నా తెలుగు సినిమా ఇండస్ట్ర లో వరుస విజయాలను దక్కించు కోవడంలో చాలా వరకు వెనకబడిపోయింది. కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయిన ప్రతి రోజు పండగే మూవీ తో రాశి కన్నా కు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆఖరి విజయం దక్కింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ పలు మూవీ లలో హీరోయిన్ గా నటించినప్పటికీ ఆ సినిమాలు ఏవి బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేదు.

ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం ఇప్పటికే రాశి కన్నా ,  గోపీచంద్ సరసన పక్కా కమర్షియల్ మూవీ లోను నాగ చైతన్య సరసన థాంక్యూ మూవీ లోను హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లు వరుసగా జూన్ ,  జూలై నెలలో విడుదల అయ్యాయి. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ రెండు సినిమాలు కూడా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇలా కెరియర్ ప్రారంభంలో మంచి విజయాలను బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మాత్రం వరుస విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకోలేక పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: