బ్రహ్మస్త్ర: బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం?

Purushottham Vinay
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్బీర్ కపూర్ ఇంకా ఆలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించిన 'బ్రహ్మాస్త్ర' మూవీ బాక్సాఫీసు వద్ద ఒక రేంజిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ రూ.160 కోట్ల మార్కు టచ్ చేసిందని చిత్ర యూనిట్ తెలిపింది.ఎన్నో భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా చిత్రంగా ప్రపంచ దేశాల్లో విడుదలైంది. అయితే తొలిరోజు మంచి వసూళ్లను సాధించిన ఈ సినిమా.. రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నాన్ హాలిడే రోజు ఈ మూవీ విడుదలైనప్పటికీ భారీ వసూళ్లు సాధించడం పట్ల చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేస్తోంది.ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8913 స్క్రీన్లల్లో విడుదలైన ఈ మూవీ రెండో రోజు దాదాపు రూ.85 కోట్ల మేర వసూళ్లు చేసిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ రూ.160 కోట్లకు చేరిందని తెలిపింది. హిందీతో పాటు అన్ని భాషల్లో సినిమాకు చక్కటి కలెక్షన్స్ వస్తున్నాయని పేర్కొంది.


2డీ వెర్షన్ తో పాటు త్రీడీకి కూడా చక్కటి ఆదరణ లభిస్తుందని వెల్లడించింది.అయితే ఈ సినిమాపై పెట్టుబడులు పెట్టిన పీవీఆర్, ఐనాక్స్ సంస్థలకు భారీ నష్టం వాటిల్లిందని నెట్టింట తెగ వార్తలు వచ్చాయి. బ్రహ్మాస్త్ర సినిమా వల్ల ఈ రెండు సంస్థలు రూ.800 కోట్లు నష్టపోయాయని ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే దీనిపై మేకర్స్ ఇప్పటివరకు స్పందించలేదు. తాజాగా పీవీఆర్ సీఈవో కమల్ ఆ వార్తలపై స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. తామేమి నష్టపోలేదని, మంచి కలెక్షన్లు వస్తున్నాయని చెప్పారు.కాగా, ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున , బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, హీరోయిన్ మౌనీ రాయ్ కీలక పాత్రల్లో నటించారు. కరణ్ జోహార్‌, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా నిర్మాతలుగా వ్యవహరించారు. భారీ హంగులతో రూపొందిన ఈ సినిమాను దాదాపు రూ.400 కోట్లతో తెరకెక్కించారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: