ఎన్టీఆర్ 30 వ మూవీలో ఆ క్రేజీ ముద్దుగుమ్మను హీరోయిన్ గా తీసుకొనున్నారా..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఈ సంవత్సరం విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో గ్లోబల్ గా అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఈ మూవీ కి దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించగా , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ మూవీ లో హీరోగా నటించాడు. ఇది ఇలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ ని క్రియేట్ చేసుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరి కొన్ని రోజుల్లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో హీరోగా నటించబోతున్నాడు.

ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వచ్చేసింది. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించనుండగా , రత్నవేలు ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు. ఇది ఇలా ఉంటే ఇది వరకే ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే రెండవ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆ అంచనాలకు మించి అన్నట్టుగా కొరటాల శివ కూడా ఎన్టీఆర్ మూవీ ని దాదాపు తొమ్మిది భాషలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా తెరకెక్కబోతుంది.  ప్రస్తుతం కొరటాల శివ , ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ 30 వ మూవీ లో రష్మిక మందన ను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో మూవీ మేకర్స్ ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: