శర్వానంద్ అప్పుల కస్టాలు !

Seetha Sailaja
హీరో శర్వానంద్ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా హీరోగా సెటిల్ కాలేకపోతున్నాడు. అతడి క్లాస్ మేట్స్ రామ్ చరణ్ రానా లు ఇండస్ట్రీలో ఇప్పటికే తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నప్పటికీ శర్వానంద్ మాత్రం సెటిల్ కాలేకపోతున్నాడు. సెన్సిబుల్ యాక్టర్ గా మంచి పేరు ఉన్నప్పటికీ మాస్ ప్రేక్షకులలో ఏమాత్రం ఇమేజ్ లేకపోవడంతో శర్వానంద్ సినిమాలు కేవలం క్లాస్ ప్రేక్షకులకు  మాత్రమే పరిమితం అవుతున్నాయి.

ఈమధ్య కాలంలో వరస ఫ్లాప్ లు చూస్తున్న శర్వానంద్ లేటెస్ట్ గా విడుదల అవుతున్న ‘ఒకే ఒక జీవితం’ మూవీ పై ఆశలు పెట్టుకున్నాడు. అమల తల్లిగా నటిస్తున్న ఈ మూవీ అంతా అమ్మ సెంటిమెంట్ చుట్టూ తిరుగుతుంది. తల్లిని విపరీతంగా ప్రేమించే శర్వానంద్ టైమ్ మిషన్ లో వెనక్కు వెళ్ళి తన తల్లిని తిరిగి కలుసుకునే సాఫ్ట్ పాయింట్ చుట్టూ ఈ మూవీ కథను అల్లడం జరిగింది.

ఈ మూవీ ప్రమోషన్ లో అమల విపరీతంగా పాల్గొంటూ ఈ మూవీ గురించి అందరికీ తెలిసేలా చేసింది. అయితే ఈ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ తో సరిసమానంగా విడుదల అవుతూ ఉండటంతో ఈ మూవీ ఓపెనింగ్స్ పై సందేహాలు ఉన్నాయి. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే ఈ మూవీ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ శర్వానంద్ తన ఆర్ధిక స్థితిని గురించి ఆసక్తికర విషయాలు తెలియచేసాడు.

ఒక దర్శకుడు చెప్పిన కథ నచ్చి తానే నిర్మాతగా మారి ‘కో అంటే కోటీ’ మూవీని నిర్మించి ఆమూవీ ఫ్లాప్ అవ్వడంతో కోట్లాది రూపాయల నష్టాలతో అప్పులు పాలైన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. ఆసినిమా ఫ్లాప్ అయి తాను అప్పులలో ఉన్నాను అని తెలుసుకుని తన చుట్టాలు స్నేహితులు కూడ తనతో మాట్లాడటం తగ్గించేసారని తాను వారిని ఎక్కడ డబ్బు అప్పుగా అడుగుతానో అన్న భయంతో అలా వారు ప్రవర్తించార అన్న సందేహాలు తనకు ఇప్పటికీ ఉన్నాయని అంటున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: