ఓటిటిలో నితిన్ 'మాచర్ల నియోజకవర్గం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Anilkumar
యూత్ స్టార్ నితిన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే తాజాగా  యూత్ స్టార్ నితిన్ , మరియు యంగ్ బ్యూటీ కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం `మాచర్ల నియోజకవర్గం`. ఇక ఈ మూవీతో ఎం. ఎస్. రాజశేఖర్ రెడ్డి అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.కాగా శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి ఈ మూవీని నిర్మించారు.ఇకపోతే కేథరిన్ థ్రెసా, సముద్రఖని, శుభలేఖ సుధాకర్, బ్రహ్మాజి, మురళిశర్మ, రాజేంద్రప్రసాద్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు.అయితే  పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న 

ఈ చిత్రం ఆగస్టు 12న భారీ అంచనాల నడుమ విడుదలై.. బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.అయితే వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న నితిన్‌.. ఈ సినిమా అయినా హిట్ కొట్టాలని ఆశ పడ్డాడు. కానీ, ఆయన ఆశ నిరాశే అయింది.ఇదిలావుంటే ఇక యూత్ స్టార్ నితిన్ , మరియు యంగ్ బ్యూటీ కృతి శెట్టి జంటగా నటించిన `మాచర్ల నియోజకవర్గం`  సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.అయితే యూత్ స్టార్ నితిన్ , మరియు యంగ్ బ్యూటీ కృతి శెట్టి జంటగా నటించిన ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.

అయితే  ఇక బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో.. అమెజాన్ వారు ఆలస్యం చేయకుండా ఓటీటీలోకి దింపేస్తున్నారు.ఇకపోతే  సెప్టెంబర్ 10 నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవ్వబోతోందట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలావుంటే ఇక ఇటీవల కొన్ని సినిమాలు బిగ్ స్క్రీన్ పై అలరించలేకపోయినా.. ఓటీటీలో హిట్ అవుతున్నాయి.అయితే  మరి యూత్ స్టార్ నితిన్ , మరియు యంగ్ బ్యూటీ కృతి శెట్టి జంటగా నటించిన `మాచర్ల నియోజకవర్గం` కూడా ఓటీటీలో హిట్ అవుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: