"గాడ్ ఫాదర్" లో నయనతార పాత్ర హైలైట్ అవుతుందా ?

VAMSI
తమిళ్ మరియు తెలుగు రెండు రాష్ట్రాల ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్న నటి నయనతార.. ఈమెకు ప్రేక్షకులు పెట్టుకున్న మరోపేరు లేడీ సూపర్ స్టార్. అయితే ఈమె తెలుగు సినిమా లో నటించి మూడు సంవత్సరాలు అవుతోంది. అయితే దీనికి కరోనా కూడా ఒక కారణం అనుకోండి. ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాల్లో నటించి అభిమానులకు దగ్గరగానే ఉంది. ఈ మధ్యనే తాను ఎప్పటి నుండో ప్రేమిస్తున్న తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుంది నయన్. కాస్త గ్యాప్ తీసుకుని ఇప్పుడు మళ్ళీ కెమెరా ముందుకు వచ్చింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రను చేస్తోంది.
ఈ సినిమా మలయాళంలో మోహన్ లాల్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ "లూసిఫర్" కు రీమేక్ అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మక్కీకి మక్కీ దించకుండా తెలుగు నేటివిటీకి తగినట్లుగా కొన్ని మార్పులను చేస్తున్నారట. అయితే ఈ సినిమాలో నయనతార పాత్ర బాగా హైలైట్ అవుతుందని చిత్ర బృందం తెలుపుతోంది. ఇందులో ఆమె సత్య ప్రియ జైదేవ్ అనే ఒక దైర్యవంతురాలైన మహిళగా నటిస్తోంది. ఖచ్చితంగా ఈ సినిమా తనకు పెద్ద బ్రేక్ ఇస్తుందని ఆశాభావాన్ని అందరూ వ్యక్తపరుస్తున్నారు. ఇందులో చిరంజీవి, సల్మాన్ ఖాన్, పుర జగన్నాధ్ లు నటిస్తున్నారు.
ఈ సినిమాను మెగాస్టార్ అభిమానులను దృష్టిలో ఉంచుకుని డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ బాణీలను అందిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 5 వ తేదీన దసరా కానుకగా విడుదల కానుంది. త్వరలోనే ఈ సినిమా నుండి పాటలు విడుదల కానున్నాయి. ఈ సినిమా హిట్ కావడం చిరంజీవికి చాలా అవసరం... ఇప్పటికే మొన్ననే వచ్చిన ఆచార్య డిజాస్టర్ గా మిగిలింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: