పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Anilkumar
టాలీవుడ్  సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోయిన్ గా, దర్శకురాలిగా, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది రేణూ దేశాయ్ .అయితే ఈమె పవన్ కళ్యాణ్, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన మొదటి సినిమా బద్రి సినిమాతో రేణూ దేశాయ్ కూడా తెలుగు తెరకు పరిచయం అయింది.ఈమె మొదటి సినిమాతోనే మంచి విజయం సొంతం చేసుకోవడంతో.. మరొకసారి పవన్ కళ్యాణ్ డైరెక్షన్లో వచ్చిన జానీ సినిమాలో కూడా మెరిసింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే  ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో డేటింగ్ చేయడం, కొడుకు అఖీరాజన్మించడం, ఆ తర్వాత 2009 లో పవన్ కళ్యాణ్ ను వివాహం చేసుకోవడం అన్నీ అలా కొద్ది రోజుల్లోనే జరిగిపోయాయి.

అయితే వివాహం చేసుకున్న తర్వాత ఆధ్యా జన్మించింది. ఇక ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్న తర్వాత రేణూ అప్పటినుంచి ఒంటరిగానే జీవిస్తోంది.కాగా సోషల్ మీడియాలో ఎప్పుడు చురుగ్గా ఉండే రేణు దేశాయ్ చాలా అందంగా, ట్రెడిషనల్ గా కనిపిస్తూ ఒక సాంప్రదాయమైన గృహిణిగా తన బాధ్యతలను నెరవేరుస్తోంది.. ఇకఆమె ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి పెద్దగా తెలియదనే చెప్పాలి.. అయితే  సినిమాలోకి రాకముందు మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన రేణూ దేశాయ్ ఆ తర్వాత కాస్ట్యూమ్, డిజైనర్ గా, హీరోయిన్ గా, డైరెక్టర్ గా, నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది.

ఇదిలావుంటే 1981 డిసెంబర్ 4 న గుజరాతీ బ్రాహ్మణ కుటుంబం లో జన్మించిన రేణూ దేశాయ్ తెలుగు కూడా బాగా మాట్లాడుతుంది.అంతేకాదు జేమ్స్ పండు అనేతమిళ చిత్రంలో కూడా నటించింది రేణూ దేశాయ్.ఇక  2021లో రాధమ్మ కూతురు సీరియల్ లో అతిథి పాత్రలో కూడా నటించింది. 2014లో ఇష్క్ వాలా లవ్ అనే చిత్రానికి దర్శకత్వం వహించి, నిర్మాతగా కూడా వ్యవహరించింది.అయితే  ఖుషి, జానీ, బాలు, అన్నవరం , గుడుంబా శంకర్ వంటి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పనిచేస్తుంది. ఇక అంతేకాదు ఖుషీ, బాలు వంటి చిత్రాలకు ఎడిటర్ గా కూడా పనిచేసింది రేణూ దేశాయ్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: