విజయ్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో..?

Anilkumar
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి పరిచయం అవసరం లేదు.అయితే ఈయన ప్రస్తుతం స్పీడు మీదున్నాడు. అంతేకాకుండా వరుసగా కథలను ఓకే చేస్తూ సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు.ఇదిలావుంటే ఇటీవలే భారీ అంచనాలతో విడుదలైన 'బీస్ట్' తీవ్రంగా నిరాశపరిచింది.అయితే  ప్రేక్షకులే కాదు అభిమానులు కూడా ఈ చిత్ర ఫలితాన్ని జీర్ణించుకోలేకపోయారు.కాగా  ప్రస్తుతం ఈయన వంశీపైడిపల్లి దర్శకత్వంలో నేరుగా తెలుగులో వారసుడు సినిమా చేస్తున్నాడు. అంతెందుకు ఇటీవలే విడుదలైన విజయ్ పోస్టర్‌లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.ఇక  ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని..

 వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.కాగా  ఈ చిత్రం తర్వాత విజయ్, లోకేష్ కనగరాజ్‌తో సినిమా చేయనున్నాడు.అయితే  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది.అంతేకాదు తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌ను సంప్రదించారట. అయితే పాత్ర నచ్చడంతో సంజయ్‌దత్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట . ఇక ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుండి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు చూడాల్సిందే.

ఇకపోతే ప్రస్తుతం ఈయన ముఖ్య పాత్రల్లో నటుస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు.తాజాగా కేజీఎఫ్‌, శంషేరా వంటి సినిమాలతో తన విలనిజంతోనూ ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఈ చిత్రంలో గౌతమ్ మీనన్ ప్రతినాయకుడి పాత్రలో నటించనున్నట్లు టాక్.అయితే విజయ్- లోకేష్ కనగరాజ్‌ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీగానే అంచనాలున్నాయి. ఇకపోతే గతంలో వీళ్ళ కాంబోలో వచ్చిన మాస్టర్ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇక ఈ చిత్రం కూడా లోకేష్ తన మల్టీవర్స్‌లో భాగంగానే తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ చిత్రం కోసం పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లను లోకేష్ రంగంలోకి దింపనున్నట్లు సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: