కమల్ హాసన్ పై కోప్పడ్డ డైరెక్టర్.. అలిగి షూటింగ్ కు రానన్న హీరో.. అసలేం జరిగిందంటే..?

Anilkumar
యూనివర్సల్ స్టార్ కమల్హాసన్ - జయసుధ కాంబినేషన్లో రూపొందిన సినిమా  సొమ్మొకడిది సోకొకడిది'  .ఇక ఈ సినిమా 1979లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న సింగీతం ఈ సినిమాకి సంబంధించిన ఒక సంఘటనను గుర్తుచేసుకున్నారు.అయితే కమలహాసన్‌తో చాలా సినిమాలు చేశారు.ఇక  సొమ్మొకడిది..సోకొకడిదిలో ఒక విషయంలో బాగా అలిగారట ఎందుకు..? అని అడగగా ఈ సమాధానమిచ్చారు. ఆయన మాట్లాడుతూ..."కమల్‌తో ఏడు సినిమాలు చేశా.ఇక  అందులో సొమ్మొకడిది..సోకొకడిది ఒకటి.అయితే  సముద్రం ఒడ్డున ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది.

కమల్‌ హసన్ ఇంకా , జయసుధ డ్యూయెట్‌ అది.ఇది 3 గంటలకల్లా వచ్చేయాలి.అయితే  4.30 గంటలకు కూడా రాలేదు.నేను 'ఎండపోతోంది' అంటూ గట్టిగా అరిచా.అయితే  ఎవరో వెళ్లి కమల్‌హాసన్‌ను తిడుతున్నట్టు చెప్పారు. ఆయన నేరుగా వచ్చి కూర్చున్నారు. ఇక 'నాకు కోపంగా ఉంది. దీనితో నేను షూటింగ్‌కు రానని డైరెక్టర్‌కు చెప్పండ'ని అసిస్టెంట్‌కు చెప్పాడు. 'నా కోసం, నీకోసం సూర్యుడు ఉండడు కదా.మనం మళ్లీ రేపు రావాలి కదా' అనే సరికి అంతా వచ్చేశారు. అయితే  ఇక లొకేషన్కు వచ్చిన కమల్ దూరంగా కుర్చీలో కూర్చున్నారు.అంతేకాదు  చిన్నపిల్లాడు మాదిరిగా అలిగి కూర్చున్నారు. ఇక దాంతో నేను ఆయన దగ్గరికి వెళ్లి 'ఏమైంది సార్' అని అడిగాను.

అయితే 'మీరు అందరి ముందు నన్ను తిట్టారట. అందుకే నాకు కోపం వచ్చింది .. నేను షూటింగ్ చేయను' అన్నారు. 'అలా అని మీకు ఎవరు చెప్పారు సార్ .. నేను మిమ్మల్ని ఏమీ అనలేదు అండి.మనకి ఒక వైపున ఎండపోతోంది .. సూర్యుడు ఎవరి కోసమూ వెయిట్ చేయడు.నేను ఆ టెన్షన్ లో చిరాకుపడ్డాను అంతే .. ఒకవేళ మీరు హర్ట్ అయితే సారీ' అన్నాను. 'అయితే ఇక  మీరు నన్ను తిట్టలేదా?' అని ఆయన అంటే ' అలాంటిదేం లేదు సార్' అన్నాను.  పదండి' .. అంటూ ఆయన షూటింగ్ పాల్గొన్నారు.అయితే  ఆ సంఘటన తర్వాత నేను కమల్ ఇప్పటివరకూ ఇద్దరం మంచి స్నేహితులముగానే ఉన్నాం. అంతేకాదు ఒకరిపై ఒకరం జోకులు వేసుకుంటాము.... నవ్వుకుంటాము" అంటూ చెప్పుకొచ్చారు ఆయన..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: