ప్రభాస్ సినిమాలో అమితాబ్ పాత్ర అదేనా..!!

Divya
ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో ప్రాజెక్ట్-k సినిమా కు ప్రత్యేకమైన స్థానం ఉంది. మహానటి సినిమాతో డైరెక్టర్ గా మారిన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు.ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొనే, దిశాపటాని హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక ఇందులో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండడం గమనార్ధం. దీంతో ప్రాజెక్టు కే సినిమా పైన భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇక ప్రభాస్ తో పాటుగా అమితాబచ్చన్ క్యారెక్టర్ ఎలా ఉంది అనేదానిపై సినీ ప్రేక్షకులు సైతం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో అమితాబచ్చన్ మాట్లాడుతూ తన పాత్ర ఎలా ఉంటుందో రిలీజ్ చేసినట్లుగా సమాచారం. ఇందులో అమితాబచ్చన్ మీసాలు గడ్డాలు చాలా పెద్దవిగా ఉండే క్యారెక్టర్ లో కనిపించనున్నారట . ఇక తనకి అసలు గడ్డం ఉండే క్యారెక్టర్ నచ్చదు..కానీ అలాంటి పాత్రలు ఎక్కువగా వస్తున్నాయని.. కానీ చేయవలసిన పరిస్థితి అని అమితాబ్ బచ్చన్ తెలియజేశారు. దీన్ని బట్టి చూస్తే బాలీవుడ్ అమితాబచ్చన్ గెటప్ ఈ సినిమాలో చాలా హైలైట్ గా ఉండబోతుందని అర్థం అవుతొంది.

ఇక అమితాబచ్చన్ గతంలో కూడా మనం సినిమాలో ఒక స్పెషల్  కనిపించారు. ఇక చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో కూడా కీలకమైన పాత్రలో నటించారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ -k సినిమాలో కూడా కీలకమైన సన్నివేశంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కూడా వైజయంతి మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత సి అశ్వినిదత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. చైనా, అమెరికా వంటి ఇంటర్నేషనల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని అనేక భాషలలో కూడా విడుదల చేస్తున్నామని అశ్వినీత తెలియజేశారు ఈ చిత్రం 2024 దసరా కానుకగా అక్టోబర్ 24న విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: