బిగ్ బాస్ పై సంచలన కామెంట్ చేసిన సిపిఐ నారాయణ..!!

Divya
బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో గా పేరుపొందింది బిగ్ బాస్. ఈ షో తెలుగులో కూడా భారీగానే సక్సెస్ అవుతోంది. ఇప్పటివరకు ఐదు సీజన్లను పూర్తిగా విజయవంతంగా చేసుకుంది. నాగార్జున 6వ సీజన్ కు కూడా హోస్టుగా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ కొత్త సీజన్ ఆదివారం నుంచి మొదలయ్యింది. ఇందులో మొత్తం మీద 21 మంది కంటెస్టెంట్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఓటీటి లో ప్రసారం అవుతోంది. అయితే బిగ్ బాస్ అనేది రియాలిటీ షో కాదని అదొక బ్రో*ల్ హౌస్ అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పలు కామెంట్లు చేయడం జరిగింది.

బిగ్ బాస్ మొదటి సీజన్ నుంచి ఈ షో ని బ్యాన్ చేయాలని నారాయణ వ్యాఖ్యానిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ రియాలిటీ షో వలన ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదని అదొక బ్రో*ల్ హౌస్ అని కూడా కామెంట్లు చేస్తూ వచ్చారు. ఇప్పుడు తాజాగా మరొకసారి ఘాటు వ్యాఖ్యలను చేయడం జరిగింది. నారాయణ ఇలా మాట్లాడితే మొదటినుంచి ఈ షో అంటే తనకి అసలు ఇష్టం లేదని.. ఇది సమాజానికి దుష్ట శత్రువు వంటిది అని తెలియజేశారు. ఒకరికొకరు పరిచయం లేని యువతీ యువకులను అందులోకి తీసుకువెళ్లి.. వంద రోజులు మీరు ఏమైనా చేసుకోండి అంటూ వదిలేస్తారని నారాయణ ఒక మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం.

ఇలాంటి షోల వల్ల భారతీయ కుటుంబకల్చర్ నేర్పిస్తారా సంస్కృతిని నేర్పిస్తారా.. అరాచకాలు ఎలా చేయాలో ఈ షోలు చూసే నేర్చుకుంటున్నారు అని కామెంట్లు చేయడం జరిగింది సిపిఐ నారాయణ. ఇంట్లో పెట్టి 20 మంది కోతులతో ఆటలు ఆడిస్తున్నట్లుగా ఉంటుంది వాటిని లక్షలాదిమంది కళ్ళు ఆర్పకుండా చూస్తున్నారని తెలియజేశారు. ఇది ఒక సామాజిక రుగ్మత కాబట్టి నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు నారాయణ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: