'లైగర్' మూవీ కోసం మైక్ టైసన్ కు అన్ని కోట్లు చెల్లించారా..?

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయిన విజయ్ దేవరకొండ తాజాగా లైగర్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ కావడంతో ఈ మూవీ కోసం విజయ్ దేవరకొండ అద్భుతమైన బాడీని కూడా బిల్డ్ చేసుకున్నాడు. ఈ మూవీ లో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించగా ,  డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో రమ్య కృష్ణ , విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో నటించగా , మైక్ టైసన్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కోసం మైక్ టైసన్ భారీ మొత్తంలో రెమ్యూనిరేషన్ తీసుకున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ...  ఈ మూవీ లో మైక్ టైసన్ కనిపించింది అతి తక్కువ సమయమే అయినప్పటికీ ఈ మూవీ కోసం ఏకంగా 23 కోట్ల రెమ్యూనరేషన్ ని మైక్ టైసన్ పుచ్చుకున్నట్లు ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. లైగర్ మూవీ పై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాలు పెట్టు కోవడానికి ప్రధాన కారణం ఈ మూవీ లో మైక్ టైసన్ నటించడం కూడా అని చెప్పవచ్చు. ఆగస్టు 25 వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల అయిన లైగర్ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకుని ప్రస్తుతం మూవీ యూనిట్ ఆశించిన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేక పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: