అదిరిపోయేలా ఉన్న విశాల్ కొత్త సినిమా పోస్టర్..!!

Divya
కోలీవుడ్ నటుడు విశాల్ తన తదుపరిచిత్రం మార్క్ ఆంటోనీ సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక విశాల్ సక్సెస్ , ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఇక ఈ చిత్రంతోనైనా బాక్స్ ఆఫీస్ దగ్గర తన సత్తా చాటాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ముఖ్యంగా తెలుగులో కూడా ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పలు ప్రాజెక్టుల వెతుకులాటలో ఉండగానే విశాల్ తన తదుపరి చిత్రాలను ప్రకటిస్తూ ఉన్నారు. ఈసారి రెగ్యులర్ కమర్షియల్ కథలతో కాకుండా పలు ప్రయోగాత్మకంగా చిత్రాలతో రాబోతున్నారు.

మార్క్ ఆంటోనీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా విభిన్నంగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముందుగా ప్రకటించిన విధంగానే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను  చిత్ర బృందం విడుదల చేశారు.  మునుపేన్నడు లేని విధంగా హీరో విశాల్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ముఖ్యంగా ఈ పోస్టర్ ను  చూస్తే విశాలేనా అన్నట్లుగా అనుమానాలు కూడా వస్తున్నాయి. పొడవాటి గడ్డం,  వత్తయిన జుట్టుతో చాలా మాస్ లుక్ లో అందరిని ఆకట్టుకుంటున్నాడు. చూస్తుంటే ఈసారి విశాల్ సరికొత్త తరహాలో సక్సెస్ అందుకునేలా ఉన్నారని చెప్పవచ్చు.  అలాగే తెలుగులో కూడా ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

నిర్మాతగా విశాల్ తీవ్రమైన నష్టాలలో ఉన్నప్పటికీ..తను నటిస్తున్న మార్క్ ఆంటోని సినిమా పైన భారీ ఆశలు పెట్టుకున్నారు.  యాక్సెంట్ రామాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఆది రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఎస్ జె సూర్య కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. అలాగే మరి కొంతమంది ప్రముఖులు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా  రీతూ  వర్మ నటిస్తున్నది.  మినీ స్టూడియోస్ పథకం పై వినోద్ కుమార్ ఈ సినిమా నీ నిర్మించారు. మరి హీరో విశాల్ ఈ సినిమాతో నైనా తన కష్టాలను గట్టెక్కించుకుంటాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: