వన్ డే కాస్ట్ ఎంత..? నెటిజన్ ప్రశ్నకు షాకింగ్ రిప్లై ఇచ్చిన అనసూయ..?

Anilkumar
బుల్లితెరపై,ఇంకా అటు వెండితెరపై యాంకర్ గా, తను పోషించిన పాత్రల ద్వారా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న యాంకర్లలో అనసూయ ఒకరు.బుల్లి తెర హాట్ యాంకర్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈమె.అయితే  గతేడాది విడుదలైన పుష్ప ది రైజ్ సినిమా సక్సెస్ సాధించడంతో అనసూయ క్రేజ్, పాపులారిటీ మరింత పెరిగింది.ఇకపోతే లైగర్ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అనసూయ టార్గెట్ గా విజయ్ దేవరకొండ అభిమానులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.ఇదిలావుంటే ఇక ఒక నెటిజన్ వన్ డే కాస్ట్ ఎంత మీది.. అదే షో ఆర్గనైజ్ చేయడానికి అంటూ ట్వీట్ చేయగా..

 ఆ ట్వీట్  ను అనసూయ రీట్వీట్ చేస్తూ "చాలా లోకువ కదండీ మీకు నేనంటే.. మీ చెల్లినో.. లేదా మీకు పెళ్లై.. మీ భార్య లేదా చెల్లి పర్ డే కాస్ట్ ఎంత? అదే పర్ డే ఆఫీస్ లో అని అడిగితే ఏం చెబుతారు?" అంటూ రివర్స్ లో ప్రశ్నించారు.ఇకపోతే  అనసూయ నుంచి అలాంటి జవాబు రావడంతో సదరు నెటిజన్ ట్వీట్ ను డిలీట్ చేశారు.ఇక తనపై అసభ్యంగా ట్రోల్ చేసిన వాళ్లపై అనసూయ పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. కాగా అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ యాక్టర్ అని అనసూయ నిందించాలనుకుంటే ఆ సినిమా డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగాను నిందించవచ్చని..
 

నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అనసూయ సినీ కెరీర్ లో ఫ్లాపైన సినిమాలే లేవా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.అయితే కొంతమంది అనసూయపై రాయలేని భాషలో కామెంట్లు చేస్తున్నారు.ఇకపోతే  అనసూయ మాత్రం హద్దులు దాటకుండా నెటిజన్ల కామెంట్లకు తనదైన శైలిలో సమాధానాలను ఇస్తుండటం గమనార్హం. కాగా అనసూయ ఈ వివాదానికి ముగింపు పలకాలని పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు.ఇక  అనసూయ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి...!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: