దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. ఈసారి పక్కా ప్లాన్ తో..?

Anilkumar
స్టార్ హీరోగా భారీ క్రేజ్‌ ఉన్న దళపతి విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈయన  రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ ఇప్పటికే చాలా సార్లు వార్తలొచ్చాయి. ఇక ఆయన సినిమా అప్‌ డేట్లతో పోటీగా పొలిటికల్ అరంగేట్రం మీద సోషల్మీడియాలో డిస్కషన్స్‌ జరిగేవి. ఈ సారిమాత్రం రాజకీయాల్లోకొచ్చే మ్యాటర్‌ లో విజయ్ సీరియస్ గా ప్లాన్ చేస్తున్నాడట. అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా లోలోపల తన స్ట్రాటెజీని ప్రాపర్ గా వర్కవుట్ చేస్తున్నాడట. చాలా సంవత్సరాల క్రితమే రాజకీయాల్లోకి రావాలని ప్లాన్ చేశాడు దళపతి.ఇక  ఆయన తండ్రి, డైరెక్టర్ ఎస్ ఏ చంద్రశేఖర్ కూడా విజయ్ ఫ్యాన్స్‌ తో మీటింగులు ప్రణాళికలు వేసుకున్నారు. ఎందుకో ఆ తర్వాత రంగంలోకి రాలేదు.ఇదిలావుంటే ఇక కొన్నాళ్లుగా సిచ్యుయేషన్ మారింది.

అయితే ఇప్పటికే తండ్రి చంద్రశేఖర్ ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ తరఫున పాలిటిక్స్ కార్యకలాపాలు స్టార్ట్ చేసేశారు. కాగా స్టార్ హీరోగా ఓవైపు విజయ్ బిజీగా ఉంటూనే, మరోవైపు ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగిస్తూ వాళ్ల అవసరాలు చూసుకుంటూ త్వరగా పూర్తిచేయాలని ఆదేశాలిచ్చాడట విజయ్.ఇక  దీంతో విజయ్ మక్కల్ ఇయక్కమ్ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో పలుసేవా కార్యక్రమాలు విస్తృతం చేశారు. అయితే డైరెక్ట్ గా రాజకీయాల్లోకి దిగేముందే ఇలా ప్రజల్లో ఉంటూ వారి మన్ననలు పొందితే ఇమేజ్ ఇంకాస్త పెరగడంతో పాటు గ్రౌండ్ లెవల్ లో ఉన్న పరిస్థితులు కూడా పూర్తిగా అర్థమవుతాయనేది విజయ్ అండ్ టీమ్ ప్లానట.బాహాటంగా చెప్పకుండా విజయ్ ఇన్ డైరెక్ట్ గా బరిలోకి దిగిన ఘటనలు కూడా లేకపోలేదు.

ఇదిలావుంటే  గతంలోనూ ఓసారి స్థానిక ఎన్నికల్లో ఆయనకు చెందిన కొందరు పోటీ చేసి మంచి ఫలితాలు దక్కించుకున్నారు.ఇక  ఆవిషయంలోనే తండ్రికి, ఆయనకు మధ్య విబేధాలు రావడంతో ఆపార్టీతో తనకు సంబంధం లేదని విజయ్ స్టేట్మెంట్స్‌ ఇచ్చి పోలీస్ కేస్ కూడా పెట్టాడు. పోటీలో గెలిచిన ఫ్యాన్స్‌కు విషెస్ చెప్పాడు.పోతే ఆ తర్వాత మెల్లిగా మళ్లీ మారుతున్న సమీకరణాల దృష్ట్యా పాలిటిక్స్‌ ని సీరియస్ గా తీసుకున్నాడట. ఇక ఆ మధ్య హైదరాబాద్ లో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నీ సీక్రెట్ గా మీటయ్యాడని కూడా వార్తలొచ్చాయి.ఇదిలావుంటే మరోవైపు రజనీకాంత్ రాజకీయాల్లోకి ఉండడం లేదంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేయడం,మరియు  కమల్ హాసన్ కూడా పార్టీని పెద్దగా సీరియస్ గా తీసుకోకపోవడం తనకు ప్లస్ పాయింట్లు మారాయని విజయ్ డైహార్డ్ ఫ్యాన్స్‌వేసుకుంటున్న లెక్కలు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: