'రాక్షసుడు 2' లో ఆ స్టార్ హీరో..?

Pulgam Srinivas
విష్ణు విశాల్ హీరోగా అమలా పాల్ హీరోయిన్ గా రామ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ సినిమా రాక్షసన్ ఏ రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుందో మనందరికీ తెలిసిందే. అలా తమిళ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన రాక్షసన్  మూవీ ని తెలుగు లోకి రాక్షసుడు పేరుతో రీమేక్ చేశారు. తెలుగు రాక్షసుడు మూవీ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించగా , అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.

ఈ మూవీ కి రమేష్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తెలుగు లో కూడా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ మూవీ ద్వారా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి అనుపమ పరమేశ్వరన్ కి మరియు దర్శకుడు రమేష్ వర్మ కు మంచి ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే  రమేష్ వర్మ 'రాక్షసుడు' సినిమా తర్వాత ఖిలాడీ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఖిలాడి మూవీ లో రవితేజ హీరోగా నటించగా డింపుల్ హయాతి , మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటించారు.

ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకో లేక పోయింది. ఇది ఇలా ఉంటే రాక్షసుడు మూవీ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ వర్మ ఈ మూవీ కి సీక్వెల్ గా రాక్షసుడు 2 ను తెరకెక్కించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే రాక్షసుడు 2 మూవీ కి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ...  రాక్షసుడు 2 మూవీ లో కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ హీరోగా నటించే అవకాశం ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: