అలియా భట్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Anilkumar
బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ అయిన ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే.ఈమె 2012లో కరణ్ జోహార్ దర్శకత్వం లో వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోలుగా నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆలియా భట్ ఆ సినిమా ద్వారా హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది.ఇకపోతే.డియర్ జిందగీ, , హైవే, హంప్టీ శర్మకీ దుల్హనియా, కపూర్ అండ్ సన్స్ , రాజీ, గల్లీ బాయ్, 2 స్టేట్స్ వంటి సినిమాల ద్వారా స్టార్ హీరోయిన్ గా పాపులర్ అయ్యింది.అయితే 19 ఏళ్ల వయసులో తన సినీ కెరీర్ ప్రారంభించిన ఆలియ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 

ఇకపోతే  ఇటీవల రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో నటించిన ఆలియా ఈ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ ఇచ్చింది. కాగా ఈ సినిమా ద్వార పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు పొందింది. ఇదిలావుంటే ఇటీవల తన చిరకాల ప్రేమికుడు రణబీర్ కపూర్ ని వివాహం చేసుకున్న ఈ అమ్మడు తన అభిమానులకు శుభవార్త చెప్పింది. పోతే తాను తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.ఇక ఇదిలా వుండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆలియా వ్యక్తిగత విషయాల గురించి వెల్లడించింది. అయితే ఈ క్రమంలో తాను నటించిన మొదటి సినిమా విశేషాలు, ఆ సినిమా కోసం తాను తీసుకున్న రెమ్యునరేషన్ గురించి వెల్లడించింది.

ఈ క్రమంలో ఆలియా భట్ మాట్లాడుతూ.. తన మొదటి సినిమా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ కోసం ఆమె రూ. 15 లక్షలు రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలిపింది. అయితే  ఇక అప్పుడు డబ్బు వ్యవహారమంతా తన తల్లి చూసుకునేదని చెప్పుకొచ్చింది.ఇదిలావుంటే ఇప్పటికీ తన బ్యాంక్ అకౌంట్ లో ఉండే డబ్బు గురించి తనకి తెలియదని వెల్లడించింది. అయితే ఎప్పుడూ ఆర్థిక పరిస్థితిని చూసుకోవాలని చాలాసార్లు తన టీమ్ తనతో చెప్పినట్లు వెల్లడించింది.ఇక  ఈ క్రమంలో ఇప్పటి నుండి తన ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకోవాలని ఉందనీ, ఎందుకంటే తొందర్లోనే తమకి ఒక బిడ్డ కూడా రాబోతున్నాడని చెప్పుకొచ్చింది. పోతే ఇక ఈ అమ్మడు ప్రస్తుతం రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ, బ్రహ్మస్త్ర,జీలే జరా సినిమాలలో నటించనుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: