దూసుకుపోతున్న ఆనంద్ దేవరకొండ 'హైవే'..!

Pulgam Srinivas
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆనంద్ దేవరకొండ 'దొరసాని' మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. మొదటి మూవీ లోనే తన అద్భుతమైన నటనతో ఆనంద్ దేవరకొండ ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఆ తర్వాత ఈ యువ హీరో మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ థియేటర్ లో కాకుండా నేరుగా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయ్యింది.  ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. కొంత కాలం క్రితమే ఆనంద్ దేవరకొండ 'పుష్పక విమానం' సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
 

ఇది ఇలా ఉంటే తాజాగా ఆనంద్ దేవరకొండ 'హైవే' అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ నేరుగా ఆహా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయ్యింది. ఈ మూవీ లో మానస రాధాకృష్ణన్ ,  సయామీ కేర్  , అభిషేక్ బెనర్జీ  ముఖ్య పాత్రలో నటించగా , ఈ మూవీ కి 118 మూవీ తో మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న కె. వి. గుహన్ దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే నేరుగా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో  విడుదల అయిన హైవే మూవీ ప్రస్తుతం 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరిస్తుంది. ఈ మూవీ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో  విడుదల అయిన ఒక్క రోజులోనే 25  మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించినట్లు ఆహా నిర్వాహక బృందం అధికారికంగా ప్రకటించింది. ఇలా ఆనంద్ దేవరకొండ 'హైవే' మూవీ ఫుల్ స్పీడ్ లో 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: