బింబిసార 2 కి ముహూర్తం ఫిక్స్!!

P.Nishanth Kumar
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబి సారా చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. వశిష్ట అనే ఒక నూతన దర్శకుడు తో కలసి కళ్యాణ్ రామ్ చేసిన ఈ విజువల్ వండర్ సినిమాకు ప్రేక్షకులందరూ కూడా ఫిదా అయిపోయారు. సరికొత్త కాన్సెప్ట్ తో రూపొంది ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చిన చిత్ర బృందాన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందించారు. చాలా రోజుల తర్వాత ఓ సరికొత్త సినిమాను చూసిన ఫీలింగ్ కలిగిందని ప్రేక్షకులందరూ కూడా వారిని పొగిడారు

 ముఖ్యంగా కళ్యాణ్ రామ్ తన నటనతో ప్రేక్షకులందరికీ ఎంతగానో ఆకట్టుకున్నాడు. గతంలో ఎప్పుడు చేయని విధంగా ఈ సినిమాలో నటించి ఆయన తనలోని నటన స్టామినాను ప్రేక్షకులందరికీ మరొకసారి పంచాడు. ఇప్పటిదాకా కమర్షియల్ సినిమాలలో నటిస్తూ వచ్చిన ఈ హీరో ఒకేసారి పూర్తిగా తన జోనర్ మార్చి వేసి చారిత్రాత్మక సినిమాలో నటించడం నిజంగా ఈ సినిమా ఇంతటి పెద్ద విజయం అందుకోవడానికి ప్రముఖ కారణం అయ్యింది అని చెప్పాలి. అయితే ఈ సినిమా విడుదల తరువాత చిత్ర బృందం ఈ సినిమా యొక్క రెండవ భాగం చిత్రీకరణ పై స్పష్టత ఇస్తూ వచ్చింది.

తాజాగా ఈ సినిమా యొక్క రెండవ భాగం చేయబోతున్నట్లుగా కళ్యాణ్ రామ్ స్పష్టం చేశాడు అయితే ఈ సినిమాను ఎప్పుడు చేస్తామన్నది ఇంకా చెప్పలేదు ప్రస్తుతం డెవిల్ అనే ఓ సినిమాలో నటిస్తున్న కళ్యాణ్ రామ్ ఆ చిత్రం పూర్తయిన తర్వాత ఈ రెండవ భాగం సినిమాను మొదలుపెట్టే విధంగా ఆలోచన చేస్తున్నాడట మరి ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులను చేస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడిస్తుంది త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది ప్రస్తుతం చిత్ర బృందం మొత్తం కూడా మొదటి భాగం విజయోత్సాహంలో ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: